Advertisementt

విజయవాడలో మహేష్ అండ్ త్రివిక్రమ్

Mon 21st Nov 2022 10:56 AM
mahesh babu,asthi visarjan,vijayawada  విజయవాడలో మహేష్ అండ్ త్రివిక్రమ్
Mahesh Babu and Trivikram at Vijayawada విజయవాడలో మహేష్ అండ్ త్రివిక్రమ్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఈ రోజు సోమవారం విజయవాడ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకవిమానంలో మహేష్ బాబు ఆది శేషగిరి రావు, గల్లా జయదేవ్, త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు కుటుంబ సభ్యుల్లో కొంతమంది గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడ చేరుకున్నారు. మహేష్ బాబు తన తండ్రి ఆస్తికలని విజయవాడలోని కృష్ణానదిలో కలిపేందుకు విజయవాడ బయలుదేరి వెళ్లారు. గత మంగళవారం సూపర్ స్టార్ కృష్ణగారు మృతి చెందడంతో.. రెండో రోజు ఆయన అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన మహేష్ బాబు, మూడో రోజు కృష్ణగారి చిన్న కర్మని నిర్వహించారు.

కృష్ణగారు మరణించి ఈ రోజు సోమవారం ఏడో రోజు కావడంతో మహేష్ బాబు తండ్రి ఆస్తికలని కృష్ణానదిలో కలిపేందుకు విజవాడ వెళ్లారు. అక్కడ కృష్ణా కరకట్ట మీదున్న ధర్మ నిలయంలో కృష్ణగారి ఆస్తికలని మహేష్ కృష్ణానదిలో నిమజ్జనం చెయ్యనున్నారు. ఈ కార్యక్రమానికి మహేష్ తో పాటుగా ఆయన చిన్నాన్న అది శేషగిరి రావు, బావగారు గల్లా జయదేవ్, దర్శకుడు త్రివిక్రమ్, గల్లా అశోక్, గల్లా సిద్దార్థ్, నాగ సుధీర్, మంజుల భర్త కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం మహేష్ విజయవాడ లో ఉన్నారు. అక్కడ తండ్రి గారి అస్తికలు నిమజ్జనం తర్వాత హైదరాబాద్ కి బయలుదేరనున్నారు. 

Mahesh Babu and Trivikram at Vijayawada:

Mahesh Babu to Do Asthi Visarjan in Vijayawada

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ