Advertisementt

అన్నయ్య కి హృదయపూర్వక అభినందనలు: పవన్

Sun 20th Nov 2022 09:49 PM
pawan kalyan,chiranjeevi  అన్నయ్య కి హృదయపూర్వక అభినందనలు: పవన్
Heartfelt congratulations to brother Chiranjeevi: Pawan Kalyan అన్నయ్య కి హృదయపూర్వక అభినందనలు: పవన్
Advertisement
Ads by CJ

తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. 

నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)

Heartfelt congratulations to brother Chiranjeevi: Pawan Kalyan:

Pawan Kalyan wishes to Annayya Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ