Advertisementt

రాహుల్ తో కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి కామెంట్స్

Sun 20th Nov 2022 07:55 PM
suniel shetty,r athiya shetty,kl rahul  రాహుల్ తో కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి కామెంట్స్
Sunil Shetty comments on daughter marriage with Rahul రాహుల్ తో కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి కామెంట్స్
Advertisement
Ads by CJ

ప్రముఖ క్రికెటర్ KL రాహుల్ తో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు, హీరోయిన్ అతియా శెట్టి ప్రేమలో మునిగితేలడంతో పాటుగా, డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. టీమిండియా ఓపెనర్ రాహుల్ తో అతియా శెట్టి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం అందరికి తెలిసినా.. వారు మాత్రం తమ మధ్యన ఉన్న రిలేషన్ ని మాత్రం బయట పెట్టలేదు. కానీ రీసెంట్ గా అతియా శెట్టి బర్త్ డే రోజున KL రాహుల్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 

తాజాగా సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి పెళ్లిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబై లోని ఓ ఈవెంట్ లో పాల్గొన్న సునీల్ శెట్టి ని మీ అమ్మాయి అతియా శెట్టి పెళ్లి KL రాహుల్ తో ఎప్పుడు జరగబోతుంది అని ప్రశ్నించగా దానికి సునీల్ శెట్టి.. జరుగుతుంది.. త్వరలోనే కాదు మరో మూడు నెలల్లో పెళ్ళికి ఆహ్వనాలిస్తారు అనుకుంటా అంటూ అందరిలో అతియా శెట్టి-KL రాహుల్ వివాహంపై క్యూరియాసిటీని పెంచేశారు.

అయితే సునీల్ శెట్టి తన కూతురి పెళ్లిని ముంబై లో కాకుండా ఖండాలలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Sunil Shetty comments on daughter marriage with Rahul:

Suniel Shetty shares update on daughter Athiya Shetty wedding with KL Rahul

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ