ప్రస్తుతం టాలీవుడ్ vs కోలీవుడ్ అన్న రేంజ్ లో గొడవలు నడుస్తున్నాయి. అది తెలుగు డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు తెరకెక్కిస్తున్న తమిళ వారిసు చిత్రం విడుదలకు సంబందించిన ఫైట్ లో తెలుగు దర్శకనిర్మాతలు, తమిళ దర్శక నిర్మాతలు ఎవ్వరూ తగ్గడం లేదు. దిల్ రాజు గతంలో డబ్బింగ్ సినిమాలను తెలుగు సినిమాలకి పోటీగా విడుదల చేయకూడదనే మాటలని పట్టుకుని ఈ సంక్రాంతికి తెలుగు సినిమాల మీదకి పోటీగా వారసుడు విడుదల చెయ్యకూడదని తీర్మానం చేసారు.
అలా అయితే తెలుగు సినిమాల్ని తమిళంలో ఆడనివ్వమంటూ అక్కడి వారు గొడవ చేస్తున్నారు. తాజాగా వారియర్ దర్శకుడు లింగుసామి కూడా వారసుడికి తెలుగులో థియేటర్స్ ఇవ్వకపోతే.. ఇకపై వారసుడు ముందు, వారసుడు తర్వాత అనేలా ఉంటుంది పరిస్థితి అంటూ సంచలనంగా మట్లాడారు. మరి నైజాం లో ఎక్కువ థియేటర్స్ ని చేతిలో ఉంచుకునే దిల్ రాజు తన సినిమా విషయంలో ఇంత జరుగుతున్నా కామ్ గా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. వారిసు సినిమా, తెలుగు లాంగ్వేజ్ లో తెరకెక్కుతున్న సినిమా అయినా.. అందులో హీరో కోలీవుడ్ హీరో అవడంతో.. ఇంత గొడవకి కారణం అయ్యింది.
మరి ఈ విషయంలో దిల్ రాజు ఏం చేస్తాడా అనే అందరూ ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు వారసుడు సంక్రాంతికి విడుదల చేస్తాడా.. లేదంటే ఇక్కడి వాళ్ళకి భయపడి పోస్ట్ పోన్ చేస్తే.. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, అలాగని విడుదల చేస్తే తెలుగు వాళ్ళు దండెత్తేలా ఉంది పరిస్థితి. పాపం దిల్ రాజు బాగా ఇరుక్కున్నాడు.