Advertisementt

జబర్దస్త్-కామెడీ స్టార్స్ మిక్స్ అయ్యింది..

Sun 20th Nov 2022 04:50 PM
anil ravipudi,comedy stock exchange,sudigalu sudheer  జబర్దస్త్-కామెడీ స్టార్స్ మిక్స్ అయ్యింది..
Jabardasth-comedy stars are mixed.. జబర్దస్త్-కామెడీ స్టార్స్ మిక్స్ అయ్యింది..
Advertisement
Ads by CJ

జబర్దస్త్ ని వదిలిపోయిన కమెడియన్స్ తో జీ వారు అదిరింది అంటూ కామెడీ ప్రోగ్రాం చేసారు. మొదట్లో జబర్దస్త్ కమెడియన్స్ గా పాపులర్ అయ్యాకా వారు ఈటివి జబర్దస్త్ ని వదిలి జీ ఛానల్ లో కాలు పెట్టారు. దాని తర్వాత స్టార్ మాలో కామెడీ స్టార్స్ అంటూ కామెడీ చేసారు. జబర్దస్త్ లో కామెడీ స్టార్స్ లో చేసిన కమెడియన్స్ అంతా ఇప్పుడు కలిసిపోయారు. అంటే జబర్దస్త్ నుండి బయటికొచ్చిన సుడిగాలి సుధీర్ కూడా కామెడీ స్టార్స్ బ్యాచ్ తో కలిసిపోయి డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసారు. కామెడీ స్టార్స్ యాంకర్, ఢీ షోలో ఒకప్పుడు యాంకర్ గా చేసిన దీపికా పిల్లి తో కలిసి సుడిగాలి సుధీర్ ఆహా ఓటిటిలో మొదలైన కామెడీ స్టాక్ ఎక్సేంజ్ ప్రోగ్రాం లోకి ఎంట్రీ ఇచ్చారు.

సుధీర్-దీపికా పిల్లి లు యాంకర్స్ గా అనిల్ రావిపూడి జేడ్జ్ గా వేణు, అవినాష్, రాజు, సద్దాం లాంటి వాళ్ళు స్కిట్స్ చేసే కమెడియన్స్ గా మొదలైన కామెడీ స్టాక్ ఎక్సేంజ్ ప్రోగ్రాం ప్రోమోని వదిలారు ఆహా వాళ్ళు. సుధీర్ మాత్రమే కాదు, వేణు, అవినాష్, సద్దాం అందరూ జబర్దస్త్ కామెడీ, అదిరింది కామెడీ, ఇంకా స్టార్ మాలో కామెడీ స్టార్స్ లో చేసిన కామెడీ అన్ని మిక్స్ చేసి కొట్టారు. జెడ్జ్ గా వచ్చిన అనిల్ రావిపూడి అయితే నవ్వుతూనే ఉన్నాడు. 

సుడిగాలి సుధీర్ కూడా కామెడీ పండించేయ్యగా.. దీపికా పిల్లి గ్లామర్ గా ఆకట్టుకున్న ప్రోమో వైరల్ గా మారింది. ఆ ప్రోమో చూసిన వారు జబర్దస్త్- కామెడీ స్టార్స్ అన్ని మిక్స్ అయ్యాయిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jabardasth-comedy stars are mixed..:

Anil Ravipudi to entertain with Comedy Stock Exchange

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ