బిగ్ బాస్ సీజన్ సిక్స్ పదకొండు వారాలు పూర్తయ్యి పన్నెండో వారంలోకి అడుగుపెడుతుంది. ఇప్పటివరకు 11 మంది హౌస్ మేట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ఈ రోజు మరీనా 12 వ కంటెస్టెంట్ గా బయటికి వెళ్లబోతుంది. ఇక హౌస్ లో 9 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ రోజు హోస్ట్ నాగార్జున మీరు టాప్ 5 లో ఎవరు ఉండకూడదో అంటే బొట్టెమ్ 5 మెంబెర్స్ ఎవరో చెప్పుమనగా.. ఆది రెడ్డి మరీనాకి టాప్ 5 లో ఉండే అర్హత లేదు అని చెప్పాడు. భార్యా భర్తలు కలిసి ఆడేవారు.. అయినా కొద్దిగా ఆమె వీక్ అని చెప్పాడు. రాజ్ మాత్రం ఇనాయకి టాప్ 5 అర్హత లేదని చెప్పాడు. ఇనాయ కూడా రాజ్ పేరు చెప్పింది.
కొన్ని వారాలుగా మాత్రమే రాజ్ ఆడుతున్నాడు. మూడు వారాలుగా నామినేషన్స్ నుండి సేవ్ అవుతున్నాడు. నామినేషన్స్ లోకి వస్తేనే కదా అతని సత్తా తెలిసేది అని చెప్పింది. ఇక శ్రీహన్ కీర్తి టాప్ 5 కి పనికిరాదంటే.. కీర్తి మాత్రం ఆది రెడ్డి ఈ వీక్ లో చేసిన పని వలన తనకి క్రేజ్ తగ్గింది.. సో ఆది రెడ్డి అని చెప్పింది. రేవంత్ మాత్రం రోహిత్ బలమైన కంటెస్టెంట్ కానీ.. అతను ఆ బలాన్ని చూపించడం లేదు అన్నాడు. ఫైమా ఇనాయ పేరే చెప్పింది. మరీనా శ్రీహన్ కొంతమందిని డిఫరెంట్ గా చూస్తాడు అతను టాప్ 5 లో ఉండేందుకు పనికిరాడు అంది.
శ్రీ సత్య రాజ్ పేరు చెప్పగా.. రోహిత్ కీర్తి పేరు చెప్పాడు. సో టాప్ 5 లో ఉండేందుకు రేవంత్, శ్రీసత్య, ఫైమాలు తప్ప మిలిగిన వాళ్లంతా సరిపోరు అంటూ ఇతర సభ్యుల పేర్లు చెప్పారు.