Advertisementt

బుల్లితెర హీరో.. వెండితెరపై అట్టర్ ప్లాప్

Sat 19th Nov 2022 10:50 PM
sudheer sudheer,silver screen  బుల్లితెర హీరో.. వెండితెరపై అట్టర్ ప్లాప్
Small screen hero, Utter flop on silver screen బుల్లితెర హీరో.. వెండితెరపై అట్టర్ ప్లాప్
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ ఏ కమెడియన్ కి లేదు. జబర్దస్త్ లో రష్మీ ట్రాక్ తోనే బాగా పాపులర్ అయ్యి టాప్ కమెడియన్ గా ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి చేసిన స్కిట్స్ కానివ్వండి.. ఇలా ప్రతి దానిలో సుడిగాలి సుధీర్ బాగా హైలెట్ అయ్యాడు. ఢీ డాన్స్ షో లో సుధీర్ మీద హైపర్ ఆది వేసే పంచ్ లు మాములుగా పేలలేదు. అంతలా సుధీర్ ని ఈటివి యాజమాన్యం పైకి లేపింది. స్టార్ మా కి వచ్చినా సుధీర్ కి అదే రెడ్ కార్పెట్, జీ ఛానల్ లోను సుడిగాలి సుధీర్ కి ఎంత క్రేజ్ ఉందో.. అది అందరూ చూసారు. అమ్మాయిల విషయంలోనే సుధీర్ బుల్లితెర హీరోగా మారాడు.

ఆ క్రేజ్ సిల్వర్ స్క్రీన్ మీద వాడదామని హీరో అవకాశాలు రాగానే అక్కడికి జంప్ అయ్యాడు. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం ఎన్ని సినిమాలు చేసినా హీరోగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. సాఫ్ట్ వెర్ సుధీర్ కానివ్వండి, వాంటెడ్ పండుగాడు, త్రీ మంకీస్, నిన్నగాక మొన్న విడుదలైన గాలోడు ఇలా ఏ సినిమా కూడా సుధీర్ కి సక్సెస్ ఇవ్వలేదు. గాలోడు సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినా.. ఆ సినిమా కూడా క్రిటిక్స్ నుండి నామమాత్రపు రేటింగ్స్ తెచ్చుకుంది. కానీ గాలోడు సినిమాని ప్రేక్షకులు అంతో ఇంతో ఆదరిస్తుంటే.. మాస్ ఆడియన్స్ మాత్రం సుధీర్ ని హీరోని చెయ్యడంతో కలెక్షన్స్ పరంగా గాలోడు బెటర్ గా కనిపిస్తుంది.

అయితే బుల్లితెర మీద అంతగా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు హిట్ అవుతున్నా హీరోగా చేసిన సినిమాలు మాత్రం హిట్ కొట్టలేక చేతులెత్తేస్తున్నాయి. అందుకే సుధీర్ అభిమానులు.. అన్నా సినిమాల కన్నా ముందు జబర్దస్త్ మీద దృష్టి పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

Small screen hero, Utter flop on silver screen:

Sudheer Sudheer is failing as a hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ