Advertisementt

మాల్దీవుల్లో రిలాక్స్ అవుతున్న జబర్దస్త్ యాంకర్

Sat 19th Nov 2022 08:24 PM
rashmi gautam,maldives  మాల్దీవుల్లో రిలాక్స్ అవుతున్న జబర్దస్త్ యాంకర్
Rashmi Gautam Chilling In Maldives మాల్దీవుల్లో రిలాక్స్ అవుతున్న జబర్దస్త్ యాంకర్
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాప్ హీరోయిన్స్ అయినా.. చిన్న హీరోయిన్స్ అయినా కాస్త ఖాళీ దొరికితే వెకేషన్స్ అంటూ మాల్దీవులుకి చెక్కేస్తూ అక్కడ సముద్ర తీరాన, ఇసుక తిన్నెల్లో, బీచ్ ఒడ్డున, పూల్ డిన్నర్లు అంటూ హడావిడి చేస్తూ సేద తీరుతున్నారు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీస్ కి వెకేషన్స్ కి బెస్ట్ ప్లేస్ గోవా తర్వాత మాల్దీవులు అనేలా అక్కడికి పయనమవుతున్నారు. తెలుగులో జబర్దస్త్ తోనే కాదు, వెండితెర మీద చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ నిత్యం బిజీగా వుండే రష్మీ గౌతమ్ ప్రస్తుతం మాల్దీవుల్లో రిలాక్స్ అవుతున్న ఫొటోస్ ని తన ఇన్స్టా పేజీ లో షేర్ చేసింది.

ఈమధ్యన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా కోసం ప్రమోషన్స్ అంటూ హీరో నందు తో కలిసి హడావిడి చేసిన రష్మీ.. అటు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండిటికి యాంకరింగ్ చేస్తూ బిజీగా మారింది. అయితే అనసూయ జబర్దస్త్ వదిలేసి వెళ్ళాక కొన్ని వారాలు జబర్దస్త్ కి యాంకర్ గా చేసిన రష్మీకి తర్వాత ఆ ప్లేస్ లోకి సౌమ్య రావడంతో ఇకపై ఎక్స్ట్రా జబర్దస్త్ కి మాత్రమే యాంకరింగ్ చేస్తుంది. ఇక అటు బొమ్మ బ్లాక్ బస్టర్ కూడా రిలీజ్ అవడంతో కాస్త రిలాక్సేషన్ కోసం రష్మీ ఇలా మాల్దీవుల్లో తేలింది. 

అక్కడ బీచ్ ఒడ్డున, కాటేజెస్ లో రష్మీ గౌతమ్ ఎంతగా ఎంజాయ్ చేస్తుందో ఆమె షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Rashmi Gautam Chilling In Maldives:

Rashmi Gautam has solo fun in Maldives

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ