ఐదు రోజుల క్రితం యంగ్ హీరో నాగ శౌర్య షూటింగ్ స్పాట్ లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు, చిత్ర బృందం ఆయన్ని AIG ఆసుపత్రిలో జాయిన్ చెయ్యగా.. నాగ శౌర్య కొద్దిరోజులుగా డైట్ మెయింటింగ్ చెయ్యడం వలన ఆహారం, మంచినీళ్లు తీసుకోకపోవడంతో నీరసంతో కళ్ళు తిరిగిపడిపోయారని డాక్టర్స్ చెప్పారు. అదే రోజు నాగ శౌర్య కి హై ఫీవర్ కూడా ఎటాక్ అవడంతో.. నాగ శౌర్య మరింత నీరసపడిపోగా.. ఆయనని నిన్న శుక్రవారం వరకు ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు.
నాగ శౌర్య విషయంలో ఫ్యామిలీ మెంబెర్స్ కూడా కాస్త కంగారులోనే ఉన్నారు. ఎందుకంటే నాగ శౌర్య ఈ నెల 20 అంటే రేపు ఆదివారం బెంగుళూర్ లో అనూష తో పెళ్లి పీటలెక్కాల్సి ఉంది. దానితో నాగ శౌర్య కుటుంబం ఆందోళన పడింది. ఇక నాగ సౌర్య ని నిన్న ఆసుపత్రి నుండి డిశ్ ఛార్జ్ చెయ్యగా.. నిన్న రాత్రి కొద్దిగా రెస్ట్ తీసుకున్న నాగ శౌర్య ఈ రోజు శనివారం ఉదయం కుటుంబంతో కలిసి బెంగుళూర్ వెళ్లారు.
పెళ్ళికి ముందు జరగాల్సిన మెహిందీ, సంగీత్ ఫంక్షన్స్ అన్నిటిని స్కిప్ చేసేసి నాగ శౌర్య ఆసుపత్రి నుండి నేరుగా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రేపు ఆదివారం ఉదయం 11.30 గంటలకి నాగ శౌర్య-అనూషలు వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది చుట్టాల మధ్యన జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.