బిగ్ బాస్ సీజన్ 6 లో ఇప్పటివరకు పదివారాల్లో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. మధ్యలో అంటే పదో వారంలో ఒక డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అందులో వాసంతి-బాలాదిత్య వెళ్లిపోయారు. ఇక ఈ వారం పన్నెండో కంటెస్టెంట్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో హౌస్ మేట్స్ మాత్రమే కాదు, బుల్లితెర ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేసారు. ఎప్పుడో హౌస్ నుండి వెళ్లిపోవాల్సిన ఆమె కేవలం జంటగా వచ్చింది, భర్త తో చేసే రొమాన్స్ బిగ్ బాస్ కి పనికొస్తుంది అని ఉంచేశారు. లేదంటే మంచితనంతో అలా అలా బండి లాగించేసిన మరీనా 11 వారాలు హౌస్ లో ఉండడం మాములు విషయమైతే కాదు.
బిగ్ బాస్ హౌస్ లోకి భర్త రోహిత్ తో కలిసి అడుగుపెట్టి, కలిసి ఆడి, కలిసి నామినేషన్స్ లోకి వచ్చినా సేవ్ అయ్యారు. కానీ తర్వాత బిగ్ బాస్ ఇద్దరిని విడగొట్టేసి గేమ్ మొదలు పెట్టినా.. మరీనా-రోహిత్ నిజాయితీగానే గేమ్ ఆడారు. కాకపోతే మరీనా వీక్ కంటెస్టెంట్ గా మదర్ ఇండియాగా మారిపోయింది.. అందులో స్ట్రాంగ్ అన్నవారిని పంపేసి మరీనాని హౌస్ లోనే ఉంచారు.. ఫైనల్ గా ఈవారం మరీనా-శ్రీ సత్య ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఉండగా.. మరీనాని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేసినట్లుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి.
మరోపక్క రోహిత్ ని కూడా డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపే ప్లాన్ లో యాజమాన్యం ఉన్నట్లుగా తెలుస్తుంది.