Advertisementt

NBK108 కి ముహూర్తం ఫిక్స్

Sat 19th Nov 2022 11:39 AM
nbk 108,balakrishna,anil ravipudi  NBK108 కి ముహూర్తం ఫిక్స్
NBK 108 will be launched on.. NBK108 కి ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం NBK107 వీర సింహ రెడ్డి కథ ముగించే పనిలో ఉన్నారు. అనంతపూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న వీర సింహ రెడ్డి ఇకపై ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనుంది. సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమా గనక పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా మధ్యలో ప్రమోషన్స్ షురూ చేస్తుంది టీమ్. ఈ షూటింగ్ అలా ఫినిష్ చెయ్యగానే ఇలా బాలయ్య తదుపరి మూవీ NBK108 మొదలైపోతుంది. అక్టోబర్ లోనే అనిల్ రావిపూడి తో కొత్త సినిమా మొదలు పెట్టాల్సిన బాలయ్య కొద్దిగా గ్యాప్ ఇచ్చారు. 

అయితే NBK108 పూజా కార్యక్రమాలు డిసెంబర్ 8 జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లోనే పూజా కార్యక్రమాలతో NBK108 ని లాంచ్ చేయబోతున్నారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఫాదర్ గా పవర్ ఫుల్ రోల్ చెయ్యబోతుండగా.. ఆయనకి కూతురుగా హీరోయిన్ శ్రీలీలని ఎంపిక చేసాడు అనిల్. ఇక తాజాగా బాలయ్య ని ఢీ కొట్టబోయే విలన్ ని బాలీవుడ్ నుండి దింపుతున్నాడట. అర్జున్ రామ్ పాల్ అయితే బాలయ్య కి సూట్ అయ్యే విలన్ అని ఆయన్ని సంప్రదిస్తున్నారట. అలాగే హీరోయిన్ విషయంలోనూ ఈ నెల చివరి వారంలో ఓ డెసిషన్ కి వస్తారని, త్రిష మీదే ఎక్కువగా అనిల్ రావిపూడి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. 

బాలయ్యని ఎవ్వరూ చూపించని స్టయిల్లో, చూపించని పాత్రలో అనిల్ రావిపూడి చూపిస్తానని చెప్పి అందరిలో ఇంట్రెస్ట్ ని కలగజేసాడు. డిసెంబర్ 8 పూజా కార్యక్రమాలతో మొదలయ్యే ఈ మూవీ వెంటనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోతుంది అని తెలుస్తుంది.

NBK 108 will be launched on..:

NBK 108 will be launched on Dec 8 in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ