Advertisementt

శ్రీ సత్యని కాపాడేందుకు బిగ్ బాస్ స్కెచ్

Fri 18th Nov 2022 01:39 PM
bigg boss,sri sathya,big boss telugu 6  శ్రీ సత్యని కాపాడేందుకు బిగ్ బాస్ స్కెచ్
Is Bigg Boss protecting Sri Satya? శ్రీ సత్యని కాపాడేందుకు బిగ్ బాస్ స్కెచ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లోకి గ్లామర్ బ్యూటీగా అడుగుపెట్టిన సీరియల్ నటి శ్రీ సత్య మొదటి రెండు వారాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నాగార్జున రెండో వారంలో సోఫా వెనుక నించోబెట్టి క్లాస్ పీకిన తర్వాత శ్రీ సత్య బాగా పుంజుకుంది. అర్జున్ కళ్యాణ్ సత్య తో ట్రాక్ నడుపుదామనుకున్నా అది శ్రీసత్య ఎంకరేజ్ చెయ్యలేదు. ఇక అర్జున్ కళ్యాణ్ కాకుండా శ్రీహన్, రేవంత్ తో ఆమె స్నేహంగా ఉంటుంది. అర్జున్ కళ్యాణ్ వెళ్ళిపోయాక శ్రీహన్ తో శ్రీ సత్య ఫ్రెండ్ షిప్ హైలెట్ అయ్యింది. అయితే వాళ్ళు కలిసి ఆడుతున్నారనే అభిప్రాయాన్ని కీర్తి, ఇనాయాలు వ్యక్తం చేస్తూ టార్గెట్ కూడా చేస్తున్నారు. బయట కూడా సూర్య BB కేఫ్ ఇంటర్వ్యూలో నాకు ఎవరైనా టచ్ చేస్తే నచ్చదని చెప్పే శ్రీసత్య శ్రీహన్ తో ఆ హగ్గులు ఎందుకు ఇస్తుందో అర్ధం కావడం లేదనే కామెంట్స్ చేసాడు.

ఇక గత కొద్ది వారాలుగా డేంజర్ జోన్ లో ఉంటున్న శ్రీసత్యని బిగ్ బాస్ కాపాడుతున్నాడనే టాక్ బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే గ్లామర్ గర్ల్ వాసంతి వెళ్ళిపోయాక శ్రీ సత్య కలర్ ఫుల్ గ్లామర్ బుల్లితెర ప్రేక్షకులకి అవసరం. అలాగే మరో వీక్ కంటెస్టెంట్ మరీనా కన్నా శ్రీసత్య కంటెంట్ ఎక్కువ ఇస్తుంది. ఇంకా వచ్చే ఎపిసోడ్ లో ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చే టైం లో శ్రీ సత్య కి ఎమోషనల్ గా ఆమె పేరెంట్స్ వస్తే ఆ ఎపిసోడ్ మరింత గా హైలెట్ అయ్యే అవకాశం ఉన్న కారణంగా బిగ్ బాస్ శ్రీసత్య ని ఎలిమినేట్ అవ్వకుండా కాపాడుతున్నాడని అంటున్నారు.

మరోపక్క శ్రీహన్ గనక టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలిస్తే.. అది శ్రీ సత్య ఎలిమినేట్ అవకుండా ఓ వారం కాపాడితే చాలు అని అతను అంటుంటే.. శ్రీసత్య ఓ వారం కోసం ఎందుకిలా ప్రైజ్ మనీ తగ్గించుకోవడం అని అడిగింది. దానికి శ్రీహన్ ఓ వారం నీతో కలిసి ఉండొచ్చు కదా అంటూ చేసిన కామెంట్స్ తో వారి బాండింగ్ ముదిరిపాకాన పడినట్లుగా గుసగుసలు మొదలైపోయాయి.

Is Bigg Boss protecting Sri Satya?:

Bigg Boss Telugu 6 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ