దర్శకనిర్మాతగా సినిమా చేసి అది డిసాస్టర్ అయ్యింది అంటే.. వాళ్ళ పని ఆల్మోస్ట్ మునిగిపోయినట్టే. ఇప్పుడు ప్రెజెంట్ లైగర్ విషయంలో పూరి జగన్నాథ్ అలానే సఫర్ అవుతున్నాడు. పూరి ఇస్మార్ట్ శంకర్ హిట్ తో విజయ్ దేవరకొండ తో లైగర్ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించి.. హిట్ కొడదామనుకున్నాడు. కానీ ఆ సినిమా పోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. అటు నిర్మాతగా సినిమా పోయి పూరి జగన్నాథ్ సఫర్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్ లైగర్ నష్టాలు పూడ్చమని బెదిరిస్తున్నారు. ఆ విషయమై పూరి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తనని లైగర్ బయ్యర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ పూరి కేసు పెట్టారు. ఆ ఇబ్బందుల్లో ఉన్న పూరికి ఇప్పుడు ఈడీ అధికారులు మరోమారు చుక్కలు చూపిస్తున్నారు.
పూరీనే కాదు.. లైగర్ నిర్మాతగా ఉన్న ఛార్మి కూడా బాగా ఇరుక్కుంది. అదే లైగర్ కి అంత పెద్ద మొత్తం లో పెట్టుబడులు ఎక్కడినుండి వచ్చాయంటూ ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ ని టార్గెట్ చేసారు. పాన్ ఇండియా లెవల్లో సినిమా తీసి, ప్రమోట్ చేసారు. నిన్న గురువారం పూరి మరియు ఛార్మీలు ఈడీ విచారణకు గుట్టు చప్పుడు కాకుండా హాజరయ్యారు. విదేశాల నుండి పూరి-ఛార్మి ఎకౌంట్స్ లో జమ అయిన డబ్బు తాలూకు ప్రశ్నలతో పాటుగా, ఇక్కడి రాజకీయనేతలు తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీని సోమ్ము చేసుకునేందుకు లైగర్ లో పెట్టుబడి పెట్టినట్లుగా ఈడీ అధికారులకి అనుమానాలు రావడంతో పూరీ కి ఛార్మి కి నోటీసు లు ఇచ్చి విచారణకు పిలిచారు. దాదాపుగా 13 గంటల పాటు పూరీని ఛార్మిని ఈడీ అధికారులు కలిపి, విడివిడిగా ప్రశ్నించారు.
అయితే ఈ లైగర్ పెట్టుబడుల విషయంలో తెరాస నేతలు ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలోనే ఈడీ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకే పూరి, ఛార్మీలని ఈ కేసులోకి లాగినట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో టీఆరెస్ నేతలు చాలామంది ఈడీ విచారణ ఎదుర్కుంటున్నారు. ఇక పూరికి ఛార్మికి అటు సినిమా పోయే.. ఇటు విచారణాలంటూ శని పట్టినట్లుగా కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం.