Advertisementt

ఆదిపురుష్ వాయిదాపై కృతి సనన్ కామెంట్స్

Fri 18th Nov 2022 11:23 AM
kriti sanon,prabhas,adipurush  ఆదిపురుష్ వాయిదాపై కృతి సనన్ కామెంట్స్
Kriti Sanon interesting comments on Adipurush ఆదిపురుష్ వాయిదాపై కృతి సనన్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఓం రౌత్ ఆదిపురుష్ ని జనవరి 12 న విడుదల చెయ్యడం లేదు అంటూ వాయిదా వేసి జూన్ 16 న సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆదిపురుష్ టీజర్ తో నెలకొన్న గందరగోళానికి అడ్డుకట్ట వేసేందుకే ఆదిపురుష్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసారు. ఆదిపురుష్ టీజర్ యానిమేటెడ్ పిక్చర్ లా అనిపించడంతో ప్రభాస్ తో పాటుగా ప్రేక్షకులు కూడా డిస్పాయింట్ అయ్యారు. 

ఆదిపురుష్ టీజర్ 3D లో చూసాక కూడా వారు శాంతించలేదు. దానితో ఓం రౌత్ తప్పుదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా సినిమాని వాయిదా వేశారు. గ్రాండ్ విజువల్స్ కోసం మరింత వర్క్ అవసరమంటూ కారణాలు చెప్పారు. అయితే తాజాగా ఆదిపురుష్ వాయిదాపై ఈ సినిమాలో జానకి పాత్రలో కనిపిస్తున్న కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆదిపురుష్ లో నటించిన నేను మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు, అయితే ఆదిపురుష్ టీజర్ తోనే సినిమా మొత్తాన్ని అంచనా వెయ్యలేము, ఆదిపురుష్ మొత్తాన్ని చాలా గ్రాండ్ విజువల్స్ తో చాలా పవర్ ఫుల్ గా డైరెక్టర్ ఓంరౌత్ ప్లాన్ చేసారు. ఆ విజువల్స్ ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసేందుకే వర్క్ చేస్తున్నారు. అందుకే సినిమాని వాయిదా వేశారంటూ కృతి సనన్ సినిమా విడుదల విషయంలో క్లారిటీ చ్చింది. జానకిగా బుట్టబొమ్మలా కృతి సనన్-రాముడిగా ప్రభాస్ రొమాన్స్ టీజర్ లోనే చూపించి ఈ జంటపై అందరిలో ఆసక్తిని కలిగించారు మేకర్స్.

Kriti Sanon interesting comments on Adipurush:

Adipurush update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ