సూపర్ స్టార్ రజినీకాంత్ తో గతంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా తలపడ్డారు. రోబో 2.ఓ లో అక్షయ్ విలన్ గా చేసారు. ఇప్పుడు రజినీకాంత్ తో మరో హీరో యాక్షన్ షురూ చేసారు. ఆయనే కన్నడ హీరో శివ రాజ్ కుమార్. కన్నడలో విపరీతమైన పాపులారిటి ఉన్న శివ రాజ్ కుమార్ ని నెల్సెన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ కి విలన్ గా సెట్ చేసాడు. నిన్న గురువారమే శివ రాజ్ కుమార్ రజినీకాంత్ జైలర్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టినట్లుగా నిర్మాతలు ప్రకటించారు.
కన్నడలో పాపులర్ హీరో శివ రాజ్ కుమార్ ని రజినీకాంత్ ని కలిపి సినిమా చెయ్యడమే వండర్ అనుకుంటే.. ఇప్పుడు రజినీకి శివ రాజ్ కుమార్ కి మధ్యన ఫైట్ కంపోజ్ చెయ్యడం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొద్ది రోజులుగా చెన్నైలోనే షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ లో ప్రస్తుతం రజినీకాంత్-శివ రాజ్ కుమార్ లపై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ రజినీకి జోడిగా నటిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.