Advertisementt

ఊపిరి పీల్చుకుంటున్న పూజ హెగ్డే

Fri 18th Nov 2022 10:19 AM
ssmb28,pooja hegde,mahesh babu  ఊపిరి పీల్చుకుంటున్న పూజ హెగ్డే
Pooja Hegde is breathing ఊపిరి పీల్చుకుంటున్న పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న SSMB28 సెకండ్ షెడ్యూల్ కి ఆటంకాల మీద ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూట్ మొదలవగా.. వారం లోపే దానిని ముగించేసింది ఈ జంట. సెకండ్ షెడ్యూల్ అనుకునేలోపు మహేష్ తల్లి మరణం తర్వాత కొడుకుతో కొద్దిరోజులు గడిపేందుకు లండన్ వెళ్లారు. లండన్ నుండి తిరిగిరాగానే.. మహేష్ సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. అలాగే త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ తో తయారయ్యాక హీరోయిన్ పూజ హెగ్డే కోసం వెయిటింగ్ అన్నారు. ఎందుకంటే పూజ హెగ్డే కి ఈ మధ్యన కాలు బెణికి కట్టు వేశారు.

అలా పూజ హెగ్డే కాలుకి స్కాన్ చేయించి డాక్టర్స్ కూడా అంతా పర్ఫెక్ట్ అని చెబితే SSMB28 షెడ్యూల్ మొదలుపెడదామని త్రివిక్రమ్ చూస్తున్నారు. ఎందుకంటే సెకండ్ షెడ్యూలుకి హీరో-హీరోయిన్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలాంటి సమయంలో మహేష్ తండ్రిగారు సూపర్ స్టార్ కృష్ణ గారు కన్ను మూసారు. దానితో మహేష్ మరో 15 డేస్ లాక్ అయ్యారు. కృష్ణగారి దశదిన కర్మలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పదిహేను రోజులు పూజ హెగ్డే కి రెస్ట్ దొరికినట్టే. లేదంటే హడావిడిగా ఆ కాలేసుకుని సెట్స్ లోకి రావాల్సి వచ్చేది. ఇప్పుడు పూజ హెగ్డే ఊపిరి పీల్చుకుంటుంది అంటున్నారు.

Pooja Hegde is breathing:

SSMB28 shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ