Advertisementt

కుమార్తె ఎంట్రీపై.. రోజా రియాక్షన్ ఇదే!

Mon 21st Nov 2022 10:52 AM
roja,jabardasth roja,ysrcp,anshu,roja daughter anshu,anshu cine entry  కుమార్తె ఎంట్రీపై.. రోజా రియాక్షన్ ఇదే!
Roja Reaction on Her Daughter Anshu Cine Entry కుమార్తె ఎంట్రీపై.. రోజా రియాక్షన్ ఇదే!
Advertisement
Ads by CJ

నటి, రాజకీయ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ అయినటువంటి రోజా.. తను ఉన్న ప్రతి రంగంలోనూ తన ప్రతిభను కనబరుస్తూ ముందుకెళుతోంది. మొన్నటి వరకు ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా వ్యవహరించి.. ఆ షో, టాప్ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ మధ్య పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ‘జబర్దస్త్’కి గుడ్‌బై చెప్పేసింది. అయితేనేం.. తన అవసరం ఉందీ అనే ప్రతిసారి రోజా ఈ షోలలో కనిపిస్తూనే ఉంది. విషయంలోకి వస్తే.. ఈ మధ్య రోజా.. తన కుమార్తె అన్షు మాలికను హీరోయిన్‌గా పరిచయం చేయబోతుందంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. రోజా సైడ్ నుంచి క్లారిటీ లేదు కానీ.. అన్షుపై మాత్రం వార్తలు వైరల్ అయ్యాయి. ఆ హీరోతో అన్షు అరంగేట్రం అంటూ వార్తలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే రోజా మాత్రం ఇంత వరకు ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఓ ఈవెంట్‌లో.. తన కుమార్తె సినీ ఎంట్రీకి సంబంధించి వస్తున్న వార్తలపై రోజా స్పందించింది.  

 

‘‘నా పిల్లలు నటులుగా మారతానంటే ముందుగా సంతోషించేది నేనే. నేను హీరోయిన్‌గా చేసే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. వారు నిజంగా నటనవైపు వస్తానంటే మాత్రం ఒక తల్లిగా, ఒకప్పటి హీరోయిన్‌గా వారికి అండగా ఉంటాను. ఎందుకంటే, నా దృష్టిలో నటించడం అనేది గొప్ప వరం వంటిది. ఏ మాత్రం, ఎంత మాత్రం తప్పుకాదు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. కాకపోతే.. నా కుమార్తెకు సైంటిస్ట్ అవ్వాలనే గోల్ ఉంది. దాని కోసం ఎంతో కష్టపడుతుంది. నాకు తెలిసి.. నా కూతురు సినిమాల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. తనకి ఆ ఆలోచన కూడా లేదు’’ అని.. తన కుమార్తె సినీ ఎంట్రీపై వస్తున్న వార్తలని రోజా ఖండించింది.

Roja Reaction on Her Daughter Anshu Cine Entry :

Roja Clarity on Anshu Cine Entry Rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ