సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జనవరి 8 న కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు అనారోగ్య సమస్యలతో మృతి చెందగా.. సెప్టెంబర్ లో మహేష్ తల్లి, కృష్ణగారి పెద్ద భార్య ఇందిరా దేవి కన్ను మూసారు. అది ఇంకా మరవక ముందే సూపర్ స్టార్ కృష్ణ గారు తుది శ్వాస విడిచారు. అయితే నిన్న బుధవారం అభిమానుల అంతిమయాత్ర తో పాటుగా కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్య క్రియలు పూర్తి చేసారు మహేష్ బాబు.
అయితే ఈ రోజు ఘట్టమనేని కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంత బాధలోనూ మహేష్ తీసుకున్న ఈ నిర్ణయానికి కృష్ణ గారి అభిమానులు శెభాష్ మహేష్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇంతవరకు ఏ హీరో చెయ్యని పని మహేష్ చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ చెయ్యని పని మహేష్ చేస్తున్నాడు. అదేమిటంటే.. హైదరాబాద్ లో సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు.
ఆ ట్రస్ట్ ఎక్కడ ఏర్పాటుచేస్తామో త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు, కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు చెందిన ఫోటోలు, షీల్డ్ లు అందులో భద్రపరుస్తామని మహేష్ చెప్పినట్లుగా తెలుస్తుంది.