మిల్కి బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్కబోతుంది, తన పేరెంట్స్ చూపించిన అబ్బాయినే వివాహం చేసుకోబోతుంది, అది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వ్యక్తి కాదు, ముంబై కి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో తమన్నా ఏడడుగులు నడవబోతుంది అంటూ నిన్న బుధవారం బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయ్యింది. దానితో సౌత్ మీడియాలోనూ తమన్నా పెళ్లి విషయం ఒక్కసారిగా పొక్కింది. అయితే అలా అలా ఈ వార్త తమన్నా చెవిన పడినట్టుంది. తన పెళ్లి వార్తలపై తమన్నా వెంటనే స్పందించింది.
ఇన్స్టా గ్రామ్ లో స్టోరీలో ఓ పిక్ ని షేర్ చేస్తూ నా యువ వ్యాపారవేత్త భర్తని మీకు పరిచయం చేస్తున్నాను అంటూ నవ్వుతున్న ఎమోజిలానీ జోడించింది. అయితే ఆ పిక్ ఏదో కాదు, తమన్నా ఈమధ్యన F3 లో వేసిన అబ్బాయి గెటప్ లో ఉన్న పిక్ ని వెటకారంగా తన పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ పోస్ట్ చేసింది. దీనితో తమన్నా వివాహంపై వస్తున్న వార్తలన్ని ఒట్టి రూమర్స్ అని తేలిపోయాయయి. తమన్నా తన పెళ్లి రూమర్స్ పై వేసిన పవర్ ఫుల్ పంచ్ అదిరిపోయింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యడం గమనార్హం.