నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉన్నా ఆయన చిలిపి తనంతో, మాటలతో, అల్లరితో అందరిని నవ్వించేంత కెపాసిటీ ఉన్న నటుడు. ఆయనకి ఎంతగా కోపం వస్తుందో.. అంత మంచి మనిషి, అంతే కామెడీ చెయ్యగలరు. తాజాగా బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించాడనికి పద్మాలయ స్టూడియోస్ కి వెళ్లారు. నిన్న బుధవారం బాలకృష్ణ సతీ సమేతంగా కృష్ణగారికి నివాళులర్పించి మహేష్ కి ధైర్యం చెప్పారు. అలాగే ఫ్యామిలీ మెంబెర్స్ తో ముచ్చటించారు. గత కొద్దిరోజులుగా మహేష్ వరస విషాదాలతో సతమతమవుతున్నాడు.
దేవుడిలా భావించే తండ్రి మరణం మహేష్ కి తీరని లోటు. అలాగే తండ్రి భౌతిక కాయం దగ్గర మధ్యమధ్యలో మహేష్ కళ్ళ నీళ్లు చూసి ఆయన అభిమానులే కదిలిపోతున్నారు. స్టే స్ట్రాంగ్ మహేష్ అన్నా అంటూ ఎంతగా ఆయనకి సపోర్ట్ చేసినా.. మహేష్ ని ఆ బాధనుండి బయటికి తీసుకురాలేకపోయారు. ఆయన్ని ఓదార్చడం ఎవరి తరము కాలేదు. అయితే కృష్ణ భౌతిక కాయానికి నివాళు అర్పించిన బాలయ్య మహేష్ ని ఓదారుస్తూనే మధ్యలో నవ్వించడం మహేష్ అభిమానుల కడుపు నింపేసింది. మహేష్ కూడా బాలయ్య తో నవ్వుతూ మాట్లాడం ఫాన్స్ కి ఊరటనిచ్చింది.
రెండు రోజులుగా ఎంతో బాధలో ఉన్న మహేష్ అన్నని బాలయ్య బాబు తన మాటలతో నవ్వించడం, పక్కనే ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్, అలాగే మహేష్ కొడుకు గౌతమ్ కూడా నవ్వడం చూసిన మహేష్ ఫాన్స్ థాంక్స్ బాలయ్యా మా అన్నని కొద్దిసేపు బాధలో నుండి బయటపడేలా చేసి నవ్వించావ్ నీకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.