Advertisementt

త్రివిక్రమ్‌తో సినిమా.. హీరోల ఇంట్లో విషాదం!

Sun 20th Nov 2022 10:00 AM
trivikram srinivas,mahesh babu,krishna,pawan kalyan,new sentiment,heroes father,jr ntr,harikrishna  త్రివిక్రమ్‌తో సినిమా.. హీరోల ఇంట్లో విషాదం!
Trivikram Srinivas is Haunted by a new Sentiment త్రివిక్రమ్‌తో సినిమా.. హీరోల ఇంట్లో విషాదం!
Advertisement
Ads by CJ

సుప్రసిద్ధ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా అంటే.. స్టార్ హీరోలు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. త్రివిక్రమ్ ఇప్పటి వరకు పనిచేసిన హీరోలందరికీ మంచి మంచి మెమరబుల్ హిట్స్ ఇచ్చాడు. సినిమా హిట్టయినా, అవకపోయినా.. త్రివిక్రమ్ సినిమాలు మాత్రం జనాలలో మంచి ఆదరణను పొందుతాయి. వెండితెర కాకపోతే బుల్లితెర అన్నట్లుగా ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అయితే.. ఆయన సినిమాలకు ‘అ,ఆ’ల సెంటిమెంట్ ఎలా అయితే ఉంటుందో.. ఇప్పుడు మరో సెంటిమెంట్ ఆయనని వెంటాడుతోంది. అదేంటంటే.. త్రివిక్రమ్‌తో సినిమాలు చేసే స్టార్ హీరోల ఇంట్లో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఆయా హీరోల తండ్రులు.. చనిపోతుండటం అనేది ఒక సెంటిమెంట్‌గా మారిపోతుంది. అయితే అందరూ హీరోల విషయంలో ఇది జరగకపోయినా.. ముఖ్యంగా ఆయన చేసిన స్టార్ హీరోలైన పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌ల విషయంలో మాత్రం ఇది నిజమైంది. 

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘జల్సా’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఆయన ఫాదర్ వెంకట్రావుగారు మృతి చెందితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా చేసే టైమ్‌లో హరికృష్ణగారు రోడ్ యాక్సిడెంట్‌కి గురై కన్నుమూశారు. పవన్, ఎన్టీఆర్‌లతో ఫస్ట్ టైమ్ పని చేసినప్పుడు ఈ సంఘటనలు జరిగాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ మూడవ సినిమా చేస్తున్న సమయంలో.. కృష్ణగారు అస్తమయమయ్యారు. వీరితో కాకుండా త్రివిక్రమ్.. ఇంకా అల్లు అర్జున్, తరుణ్, నితిన్‌లతో సినిమాలు చేశారు. మరి వారి విషయంలో ఈ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు కదా.. అని అంతా అనుకోవచ్చు కానీ.. పవన్, మహేష్, తారక్‌ల విషయంలో మాత్రం ఈ సెంటిమెంట్ వెంటాడిందనే చెప్పుకోవాలి. ఒక్కరి విషయంలో కాదు ముగ్గురు స్టార్ హీరోల విషయం ఇది నిజమైంది. ఇలా జరిగిన ప్రతిసారి వారివెంటే వుండి వారిని ఓదారుస్తూ, వారికీ అండగా ఉంటూ, వారి బాగోగులు చూస్తూ వుంటారు. అయితే ఇదేదో త్రివిక్రమ్‌ని కించపరచాలనో, ఇంకోటో కాదు.. ఇలా జరుగుతూ వస్తుంది.. అని చెప్పడమే ఈ వార్త ఉద్దేశ్యం.

Trivikram Srinivas is Haunted by a new Sentiment:

Trivikram Srinivas Sentiment on Star Heroes Fathers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ