Advertisementt

ఆదిపురుష్ కి అవి తప్పట్లేదట

Thu 17th Nov 2022 10:34 AM
saif ali khan,adipurush,prabhas  ఆదిపురుష్ కి అవి తప్పట్లేదట
Adipurush VFX: Big changes to Prabhas and Saif ఆదిపురుష్ కి అవి తప్పట్లేదట
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ఉన్న హీరోని ఓ బొమ్మలా యానిమేట్ చేసి ఆదిపురుష్ అంటూ రాముడి అవతారంలో చూపించేస్తే అందరూ మెచ్చేస్తారు అనుకున్న ఓం రౌత్ కి ఆదిపురుష్ టీజర్ నుండి తీవ్ర వ్యతిరేఖత మొదలయ్యింది. ఆదిపురుష్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేద్దాం అనుకున్న ఆదిపురుష్ మేకర్స్ కి ఫాన్స్ కూడా షాకివ్వడంతో ఢీలాపడిపోయిన టీమ్.. హుటాహుటిన ఆదిపురుష్ రిలీజ్ డేట్ వాయిదావేసి.. కొత్త డేట్ ప్రకటించడం వెనుక గ్రాఫిక్స్ మరింతగా మెరుగ్గా చేసేందుకే అంటూ చెప్పారు. హాలీవుడ్ రేంజ్లో విడుదల చేస్తున్నామంటూ ప్రకటించి ఇప్పుడు ఈ నెగిటివిటీ నుండి బయటపడేందుకు తిప్పలు పడుతున్నారు.

అయితే సినిమా అనుకున్న తేదికి రాకుండా వాయిదా వేసింది.. సినిమాలో కొన్ని కేరెక్టర్స్ విషయంలో మార్పులు చెయ్యడానికేనట. అది తప్పడం లేదట. దాని కోసం 100 కోట్ల అదనపు భారం పడినా పర్లేదు.. కచ్చితంగా మార్చాల్సిందే అంటున్నారట. అందులో భాగంగానే ప్రభాస్ చేరువలో ఉండే.. వానర సైన్యంతో పాటుగా విలన్ పాత్రధారి సైఫ్ అలీఖాన్ చేసిన పాత్ర రావణ పాత్రలో కూడా మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి నిజంగానే తప్పు దిద్దుకునే ప్రయత్నాలు జరుగుతూన్నాయో.. లేదంటే విఎఫెక్స్ వర్క్ విషయంలోనే జాప్యం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి అంటూ ప్రభాస్ ఫాన్స్ మధనపడిపోతున్నారు. 

Adipurush VFX: Big changes to Prabhas and Saif:

Saif Ali Khan Bearded Raavan Look For Adipurush To Be Changed Through VFX? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ