Advertisementt

బాలయ్య తో పవన్ ఎనిమి తలపడితే..

Wed 16th Nov 2022 09:44 PM
balakrishna,anil ravipudi  బాలయ్య తో పవన్ ఎనిమి తలపడితే..
Arjun Rampal As Villain In Balakrishna Movie బాలయ్య తో పవన్ ఎనిమి తలపడితే..
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ మంచి ఊపుమీదున్నారు. గోపీచంద్ మలినేని తో వీర సింహ రెడ్డిని ముగించెయ్యడానికి రెడీ అయిన బాలయ్య అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద ఆహా అనిపిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 ని ఎక్కడికో తీసుకెళ్లడానికి బాలయ్య బాబు చెయ్యని అల్లరి లేదు. మరోపక్క అనిల్ రావిపూడి తో బాలయ్య నెక్స్ట్ మూవీకి ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. బాలయ్య రావడమే తరువాయి అన్నట్టుగా అనిల్ రావిపూడి చకచకా ప్రీ ప్రొడక్షన్ చక్కబెట్టేస్తున్నాడు. ఇప్పటికే హీరోయిన్ త్రిష తో అనిల్ మంతనాలు జరుపుతున్నాడనే టాక్ ఉంది.

ఇప్పుడు బాలయ్య తో తలపడబోయే విలన్ విషయంలో అనిల్ రావిపూడి ఓ కొలిక్కి వచ్చాడట. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు లో పవన్ తో తలపడబోతున్న అర్జున్ రామ్ పాల్ అయితే బాలయ్యకి తగిన విలన్ అవుతాడని అనిల్ భావిస్తున్నాడట. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ ని సంప్రదించి ఒప్పించే పనిలో ఉన్నాడట ఆయన. అలాగే బాలయ్య లుక్ టెస్ట్ కూడా త్వరలోనే మొదలు పెడతారని, దాని కోసం ఆయన పెట్టుకోబోయే విగ్స్ ని రెడీ చేయిస్తున్నాడట అనిల్. ఈమధ్యన బాలయ్య హెయిర్ స్టయిల్ విషయంలో భారీ మార్పులు జరిగిపోయాయి.. ఆయన హెయిర్ స్టయిల్ ఫాన్స్ కి కిక్ ఇస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య కి కూతురి పాత్రలో శ్రీ లీలని ఫైనల్ చేసేసాడు అనిల్ రావిపూడి.

Arjun Rampal As Villain In Balakrishna Movie:

Balakrishna-Anil Ravipudi Movie Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ