సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ ఫాన్స్ చాలామంది ఆయన్ని చివరి చూపు కోసం ఎంతో దూరం నుండి హైదరాబాద్ కి వచ్చారు. అయితే సూపర్ స్టార్ కి మెగా ఫ్యాన్ ఒకరు ఉన్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ సినిమాల్లోకి రాకముందు సూపర్
స్టార్ కృష్ణ ని ఆరాదించేవారట. అప్పట్లో కృష్ణకి ఏ హీరోకి లేని అభిమాన సంఘాలు ఉండేవి. ఆ టైమ్ లో ఉన్న హీరోలలో కెల్లా కృష్ణకి ఏకంగా 2500 అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. కేవలం తెలుగు మాత్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక ఇలా కృష్ణ కి అభిమానులు, అభిమాన సంఘాలు ఉండేవి.
అప్పట్లో చిరంజీవి కృష్ణ అభిమానుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవారు. దాని గురించి చిరంజీవి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ నుండి ప్రేరణ పొంది సినిమాల్లోకి ప్రవేశించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. గతంలో అంటే 1981లో కృష్ణ నటించిన తోడు దొంగలు సినిమా విడుదలకు ముందు పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో కరపత్రాలు విడుదలయ్యాయి. ఆ కరపత్రాల్లో అభిమాన సంఘానికి చిరంజీవి గౌరవాధ్యక్షుడిగా ఉండేవారు అని రాసుంది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా తోడు దొంగలులో కృష్ణతో కలిసి చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కూడా.