Advertisementt

తమన్నా పెళ్లి చేసుకోబోయేదెవరినంటే..

Wed 16th Nov 2022 05:58 PM
tamannaah bhatia,mumbai businessman  తమన్నా పెళ్లి చేసుకోబోయేదెవరినంటే..
Is Tamannaah Bhatia Marrying Mumbai Businessman? తమన్నా పెళ్లి చేసుకోబోయేదెవరినంటే..
Advertisement
Ads by CJ

మిల్కి బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. తమన్నా కొద్ది రోజులుగా కొత్త ప్రాజెక్ట్ లు సైన్ చేయకపోవడానికి కారణం ఆమె పెళ్లి అంటూ ఏవేవో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో తమన్నా తాను పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను అంటూ చెప్పింది. అప్పట్లో పెళ్లి వార్తలను ఖండించిన తమన్నా ఇప్పుడు ఈ పెళ్లి వార్తపై ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. తమన్నా నిజంగానే పెళ్లి చేసుకుని ఓ ఇంటిది కాబోతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు మిల్కి బ్యూటీ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో అంటూ నెటిజెన్స్ ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాని జల్లెడ పడుతున్నారు. 

తమన్నా ముంబై కి చెందిన ఓ యువ వ్యాపారవేత్తని వివాహమాడబోతుంది, అతనికి సినీ రంగానికి ఎలాంటి సంబంధం లేదు, అలాగే తమన్నా తల్లితండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లాడబోతుంది అంటూ సౌత్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే.. తమన్నా ప్రస్తుతం పలు భషాల్లో సినిమాలు చేస్తున్నా.. ఆమెకి మాత్రం బ్రేక్ ఇచ్చే సినిమా తగలడం లేదు. అటు డిజిటల్ ఎంట్రీ, ఇటు బుల్లితెర ఎంట్రీ కూడా తమన్నాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. అందుకే తమన్నా కూడా పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

Is Tamannaah Bhatia Marrying Mumbai Businessman?:

Is Tamannaah Bhatia getting married to a Mumbai businessman

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ