నందమూరి నటసింహం వీర సింహ రెడ్డిగా ఘర్జించడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న బాలయ్య వీర సింహ రెడ్డి షూటింగ్ ని దర్శకుడు గోపీచంద్ మలినేని చకచకా పూర్తి చేసేస్తున్నాడు. బాలయ్య అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో వీర సింహ రెడ్డిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నఈ సినిమాపై ట్రెడ్ లోనే కాదు, మాస్ ఆడియన్స్ లో భీభత్సమైన అంచనాలున్నాయి. అయితే వీర సింహ రెడ్డి ఇంటర్వెల్ బాంగ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతున్నట్లుగా ఇదివరకే విన్నాం.
ప్రస్తుతం అనంతపూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న వీర సింహ రెడ్డిలో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట. సినిమా మొత్తం మీద 11 యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఈ యాక్షన్ సన్నివేశాలు అన్నిటిని స్టన్ శివ ఆధ్వర్యంలో టీమ్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. వీర సింహ రెడ్డిలో ఈ ఫైట్ సీన్లే దాదాపు గంట వరకూ ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది. అంటే అఖండని మించిన యాక్షన్ సన్నివేశాలను గోపీచంద్ వీర సింహ రెడ్డిలో చూపించబోతున్నారని తెలుస్తుంది. దీనితో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.