రాజకీయంగా ఎంత శత్రుత్వాన్ని మెయింటింగ్ చేసినా.. బయట వ్యక్తుల పరంగా స్నేహంగా ఉన్న వారిని చాలామందిని చూస్తుంటాం. తాజాగా కృష్ణ గారికి చివరిసారిగా నివాళు అర్పించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు బుధవారం మహేష్ బాబు పద్మాలయ స్టూడియోకి వచ్చారు. అప్పటికే అక్కడికి బాలకృష్ణ తన ఫ్యామిలీతో వచ్చారు. కృష్ణ గారికి నివాళులర్పించి మహేష్ దగ్గరే బాలయ్య చాలా సేపు ఉన్నారు. ఇంతలో జగన్ వచ్చి కృష్ణగారి భౌతిక కాయానికి పుష్ప గుచ్చం ఉంచి నివాళు అర్పించి మహేష్ ని ఆలింగనం చేసుకుని పలకరించిన జగన్.. ఆ వెనకనే ఉన్న ఆయన రాజకీయ ప్రత్యర్థి బాలయ్యని పలకరించడం హైలెట్ అయ్యింది.
మహేష్ బాబు, అలాగే కృష్ణ గారి కూతుర్లని, ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ ని జగన్ పలకరించారు. అక్కడే ఉన్న బాలయ్యని పలకరించడం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ రోజు కృష్ణ గారి కడసారి చూపు కోసం ఆయన అభిమానులు పోటెత్తారు. మధ్యలో మినిస్టర్ రోజా, తెలంగాణ గవర్నర్ తమిళ సై, రఘురామ కృష్ణం రాజు, జయప్రద, త్రివిక్రమ్, మెహెర్ రమేష్ ఇంకా పలువురు ప్రముఖులు రాగా.. అక్కడ అభిమానుల తోపులాటతో పోలీస్ లు లాఠీ ఛార్జ్ చెయ్యగా.. ఓ అభిమాని గాయపడ్డాడు. మరికాసేపట్లో కృష్ణగారి అంతిమ యాత్ర పద్మయాల నుండి మొదలై మహా ప్రస్థానంలో ఈ రోజు 3 గంటలకు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగనున్నాయి.