Advertisementt

అధికార లాంఛనాలతో కృష్ణగారి అంత్యక్రియలు

Tue 15th Nov 2022 01:36 PM
krishna,super star krishna  అధికార లాంఛనాలతో కృష్ణగారి అంత్యక్రియలు
Krishna last rites with official ceremonies అధికార లాంఛనాలతో కృష్ణగారి అంత్యక్రియలు
Advertisement
Ads by CJ

ఈ రోజు ఉదయం తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయిన సూపర్ స్టార్ కృష్ణగారి కడసారి చూపుల కోసం అభిమానులే కాదు, సినీ, రాజకీయ ప్రముఖులు నానక్ రామ్ గూడాలోని కృష్ణగారి స్వగృహానికి తరలి వెళుతున్నారు. మెగాస్టార్ చిరజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇలా అందరూ కృష్ణగారి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. చిరు, వెంకీలు మహేష్ పక్కనే కూర్చుని ఓదార్చారు. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ కి ధైర్యం చెప్పారు. కళ్యాణ్ రామ్, నాగ చైతన్య, రాజమౌళి భార్య రమా, కీరవాణి ఫ్యామిలీ, త్రివిక్రమ్, బోయపాటి, మురళి మోహన్ ఇలా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటుగా మంత్రి కేటీఆర్, మాగంటి గోపినాథ్, నారా చంద్రబాబు నాయుడు కృష్ణ గారికి నివాళులర్పించి, కృష్ణ గారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేసారు.

ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. రేపు (బుధవారం) ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.

Krishna last rites with official ceremonies:

Super star Krishna last rites with official ceremonies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ