Advertisementt

సినీ పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ

Thu 17th Nov 2022 02:01 PM
balakrishna,super star krishna,tollywood hero,krishna no more  సినీ పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ
Balakrishna pays tribute to Super Star Krishna సినీ పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ
Advertisement
Ads by CJ

‘‘ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. 

 

కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’

                                                                          - నందమూరి బాలకృష్ణ

Balakrishna pays tribute to Super Star Krishna:

Tollywood Super Star Krishna Is No More

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ