Advertisementt

సూపర్ స్టార్ కృష్ణ గారి హెల్త్ బులిటెన్

Mon 14th Nov 2022 08:31 PM
super star krishna,super star krishna health bulletin  సూపర్ స్టార్ కృష్ణ గారి హెల్త్ బులిటెన్
Super Star Krishna health update సూపర్ స్టార్ కృష్ణ గారి హెల్త్ బులిటెన్
Advertisement
Ads by CJ

ఆదివారం రాత్రి రెండు గంటలకి సూపర్ స్టార్ కృష్ణ గారిని కార్డియక్ అరెస్ట్ తో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు ఆయన కుటుంబ సభ్యులు. కృష్ణ గారు ఆసుపత్రికి వెళ్లేసరికి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, ఆయనకి వెంటనే డాక్టర్స్ సీబీపి చేసి ICU కి షిఫ్ట్ చేసి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, కృష్ణ గారి పరిస్తితి విషమంగా ఉన్నట్లుగా కాంటినెంటల్ వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో.. ఆయన త్వరగా కోలుకోవాలంటూ కృష్ణగారి అభిమానులు పూజలు చేస్తున్నారు. కృష్ణ గారు గెట్ వెల్ సూన్ అంటూ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు.

అయితే కృష్ణగారి పరిస్థితి మరింతగా దిగజారుతోంది అని, ఆయన లంగ్స్, అలాగే కిడ్నీ ఎఫెక్ట్ అయ్యాయని, ప్రస్తుతం డయాలసిస్ జరుగుతుంది అని, మల్టి ఆర్గాన్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు అని, కృష్ణ గారి ఆరోగ్యం గురించి 48 గంటలు గడిస్తేనే కానీ ప్రస్తుతం ఏం చెప్పలేమని.. లేటెస్ట్ గా కృష్ణ గారి హెల్త్ బులిటెన్ ని వైద్యులు విడుదల చేసారు. ప్రస్తుతం ఆయన కండిషన్ అత్యంత క్రిటికల్ గా ఉంది అని, ఎనిమిదిమంది వైద్య బృందం ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తుంది అని, ప్రపంచ అత్యుత్తమ వైద్యం కృష్ణ గారికి అందిస్తున్నామని, ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. 

Super Star Krishna health update :

Super Star Krishna health bulletin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ