Advertisementt

హన్సిక పెళ్లి హక్కులు ఓటిటికి?

Mon 14th Nov 2022 07:39 PM
nayanthara,hansika wedding  హన్సిక పెళ్లి హక్కులు ఓటిటికి?
Hansika sold her marriage broadcast rights to famous ott platform? హన్సిక పెళ్లి హక్కులు ఓటిటికి?
Advertisement
Ads by CJ

ఈమధ్యన తారామణులు పెళ్లి చేసుకుంటున్నారనగానే అందరి అటెన్షన్ వారి మీదే ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ ఏం చేసినా అది ప్రజలకి పిచ్చ క్రేజ్. కాబట్టే ఆ క్రేజ్ ని అడుగడుగునా క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు వాళ్ళు. అసలు పెళ్లిళ్లు అంటే ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్యన అంగరంగ వైభవంగా సంతోషంగా జరిగే వేడుక. అయితే సెలబ్రిటీస్ పెళ్ళిలో పెళ్లి కూతురు చీర, ఆమె వేసుకున్న నగలు ఎలా ఉంటాయో, వారి పెళ్లి ఫస్ట్ పిక్ చూడాలనే ఆత్రుత, ఏయే సెలబ్రిటీస్ ఆ పెళ్ళికి హాజరయ్యారని క్యూరియాసిటీ సహజంగానే అందరిలో ఉంటుంది. కానీ ఆ పెళ్లిని కూడా కొంతమంది సెలబ్రిటీస్ క్యాష్ చేసుకోవడం చూసి.. ఔరా ఎంత ఖర్మ పట్టింది అనుకోక మానరు. ఆ మధ్యన బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ లు తమ పెళ్లి హక్కులని ఓ ఓటిటి సంస్థకి కోట్లకి అమ్మేసారు.

అదే తీరు నయనతార జంట చేసింది. ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న నయనతార-విగ్నేష్ లు ఈ డబ్బు కోసమేనా అన్నట్టుగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని నెట్ ఫ్లిక్స్ కి ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్ హక్కులని అమ్మేసారు. మరి ఇదో సినిమా సెట్ లా వేసి దీనికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు పాలబుగ్గల హన్సిక తన ప్రియుడు తో సోహైల్ కతూరియాతో ఏడడుగులు నడిచేందుకు తయారవుతుంది. డిసెంబర్ 4 న రాజస్థాన్ జైపూర్ కోటాలో హన్సిక కోరుకున్న ప్రియుడు సోహెల్ తో పెళ్లి పీటలెక్కబోతుంది. అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయం సీక్రెట్ గా మెయింటింగ్ చేస్తున్న హన్సిక తాను సోహైల్ కతూరియాని పెళ్లి చేసుకుంటున్నట్టుగా రివీల్ చేసింది. 

ఇప్పుడు హన్సిక తన పెళ్ళికి ఎవరిని పిలకుండా కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యన అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని తన పెళ్లి ఫొటోస్ ని, అలాగే వీడియో హక్కులని భారీ డీల్ తో ఓ ప్రముఖ ఓటిటి సంస్థకి ఇచ్చేసింది అనే టాక్ నడుస్తుంది. అది నిజమా.. కాదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. పెళ్లి అలాగే మెహిందీ ఇంకా సంగీత్ వేడుకలు కూడా ఆ ఓటిటీకే అప్పజెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Hansika sold her marriage broadcast rights to famous ott platform?:

After Nayanthara, Hansika wedding celebrations on OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ