Advertisementt

ఈ వారం విడుదల కాబోయే చిత్రాలు

Mon 14th Nov 2022 04:50 PM
tollywood,movies  ఈ వారం విడుదల కాబోయే చిత్రాలు
Films to be released this week ఈ వారం విడుదల కాబోయే చిత్రాలు
Advertisement
Ads by CJ

ప్రతి శుక్ర వారం ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా, అందులో ఏవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయా.. అనే ఆత్రుత అందరిలో ఉంటుంది. ఎందుకంటే వారం వారం థియేటర్స్ కి వెళ్లి ఓ మూవీ చూసి డిన్నర్ చేస్తే.. ఆ ఎంజాయ్మెంట్ వేరు అనేది కొందరి ఫీలింగ్. అందుకే వచ్చే శుక్రవారం ఏ మూవీ రిలీజ్ అవుతుందా అని చాలామంది ఎదురు చూస్తారు. ఇక గత వారం సమంత యశోద విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాదు.. ఓటిటిలో విడుదలయ్యే సినిమాలపై కూడా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. వచ్చే వారం థియేటర్స్ లో అలాగే ఓటిటీలలో ఏయే సినిమాలు రాబోతున్నాయి అనే ఆత్రుత మొదలయ్యింది. ఈ వారం పెద్దగా పేరున్న సినిమాలేవీ రావడం లేదు.

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు, మసూధ, అలిపిరికి అల్లంత దూరంలో, సీతారామపురంలో ఒక ప్రేమ జంట ఇలా చినన్ సినిమాలు టాలీవుడ్ నుండి థియేటర్స్ లో విడుదలవుతుండగా.. హిందీ నుండి దృశ్యం 2 థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ సినిమాల్లో అంతో ఇంతో ఆసక్తిని కలిగించేది సుధీర్ గాలోడు మాత్రమే. ఇక ఓటిటీలలో మాత్రం ఈ వారం మెగాస్టార్ గాడ్ ఫాదర్ నెట్ ఫ్లిక్స్ నుండి అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న గాడ్ ఫాదర్.. ఇప్పుడు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. అలాగే రాజ్ తరుణ్ అహ నా పెళ్ళంట వెబ్ సీరీస్ జీ 5 లో విడుదల కాబోతుంది. అంతేకాకుండా తమిళ డబ్బింగ్ సర్ధార్ ఆహా నుండి ఈ శుక్రవారమే విడుదలకి సిద్దమయ్యింది.

Films to be released this week :

Friday Release Movies list (18 Nov 2022)

Tags:   TOLLYWOOD, MOVIES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ