సూపర్ స్టార్ కృష్ణ గారు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ప్రముఖ కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలతో ఒక్కసారిగా కృష్ణ గారి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తన పెద్ద భార్య ఇందిరాదేవి మరణంతో తీవ్ర మనోవేదనకు గురయిన కృష్ణ గారు తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చెయ్యగా.. ఆయనని ICU లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది.
కృష్ణ గారు శ్వాస సంభందిత వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన పరిస్థితి విషమంగా ఉంది అంటూ మీడియాలో వార్తలు చూసిన మహేష్ ఫాన్స్, కృష్ణగారి ఫాన్స్ తీవ్ర ఆందోళనలోకి వెళ్లిపోతున్నారు. కృష్ణ గారి దగ్గరే ఆయన ముగ్గురు కూతుళ్ళ తో పాటుగా మహేష్ బాబు, ఇంకా నరేష్ ఆయన కుమారుడు అందరూ ఆసుపత్రిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈమధ్యనే మహేష్ అమ్మగారు, కృష్ణగారి పెద్ద భార్య మరణం నుండి తేరుకుంటున్న టైం లో.. కృష్ణ గారు ఇలా ఉన్నట్టుండి ఆసుపత్రి పాలవడం అందరికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఆయన త్వరగా కోలుకుని తిరిగిరావాలంటూ ఘట్టమనేని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తూ పూజలు చేస్తున్నారు.
అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. సూపర్‌స్టార్ కృష్ణ గారి ఆరోగ్యం నిలకడగా వుంది అని.. ఆయన జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లారు అని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సమాచారం.