Advertisementt

పెళ్లిపై హీరో విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sun 13th Nov 2022 10:13 PM
kollywood hero,vishal,lathi movie teaser  పెళ్లిపై హీరో విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Hero Vishal interesting comments on marriage పెళ్లిపై హీరో విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

గతంలో కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ని ప్రేమించిన విశాల్ ఆ బ్రేకప్ తర్వాత పెద్దలు కుదిర్చిన అనీషా రెడ్డి తో నిశ్చితార్ధం చేసుకుని.. చివరికి అది కూడా బ్రేకప్ చేసుకుని సింగిల్ గా మిగిలిపోయాడు. ఈమధ్యనే విశాల్ తాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను, తనకి అరేంజ్డ్ మ్యారేజ్ అచ్చి రాదు.. త్వరలోనే ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేస్తా అంటూ ఇంట్రెస్ట్ ని రేకెత్తించాడు.  తాజాగా లాఠీ టీజర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చాడు విశాల్. లాఠీ ఈవెంట్ లో మరోసారి విశాల్ తన పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసాడు. 

మొదటి నుండి విశాల్ చెబుతున్న మాటే.. ఇప్పుడు లాఠీ ఈవెంట్ లోనూ చెప్పాడు. అది నడిగర్ సంఘం భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటాను అని, 3,500 మంది నటీనటులు, రంగస్థల కళాకారుల కోసం ఆ భవన నిర్మాణం అని, త్వరలోనే భవనాన్ని నిర్మించి పెళ్లిచేసుకుంటా అని చెప్పిన విశాల్..  కళాకారులు జీవనాన్ని మెరుగుపర్చేందుకు నా బృందం శ్రమిస్తోంది అని, ఇంకా లాఠీ చిత్రాన్ని పోలీసు కానిస్టేబుల్స్ కు అంకితం ఇస్తున్నట్టుగా ఈ వేదికపై ప్రకటించాడు.

Hero Vishal interesting comments on marriage:

Kollywood Hero Vishal Gives Clarity On Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ