Advertisementt

RC15 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Sun 13th Nov 2022 07:14 PM
ram charan,shankar,rc15  RC15 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting News on RC15 RC15 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-శంకర్ కలయికలో దిల్ రాజు భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న RC15 షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో.. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో అనే విషయంలో మెగా ఫాన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. కానీ శంకర్ రెండు పడవల మీద కాళ్ళు వేసి ఇండియన్ 2 తో పాటుగా RC15 షూటింగ్ చెయ్యడంతో.. ఈ సినిమా రిలీజ్ బాగా లేట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఇండియన్ 2 ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తే.. RC15 2024 సంక్రాంతికి వెళ్లిపోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు RC15  క్లైమాక్స్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తుంది. 

ఇంతకుముందే RC15 లో రామ్ చరణ్ లుక్స్ లీకైపోయి ఫాన్స్ కి ఆనందాన్ని ఇచ్చినప్పటికీ.. మేకర్స్ కి కష్టంగా మారింది. ఇప్పడు క్లైమాక్స్ విషయంపై ఓ లీకు బయటికి వచ్చింది. అది ప్రీ క్లైమాక్స్‌లో అదిరిపోయే ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారట. ఆ యాక్షన్ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగుతుందని అంటున్నారు. దీనికోసం విదేశాలకు చెందిన ఫైట్ మాస్టర్లను కూడా తీసుకు వచ్చారని తెలుస్తుంది. ఇంతవరకులు చరణ్ ఎప్పుడు ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించలేదని, ఈ సీక్వెన్స్ కోసం చరణ్ చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.

Interesting News on RC15:

RC15 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ