సమంత ఏం చేసినా.. అదొక ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె క్రేజ్ డబులైంది. విడాకుల తర్వాత ఆమెపై ఏ స్థాయిలో రూమర్స్ వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా వాటన్నింటినీ తట్టుకుని సమంత ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు మయోసైటీస్ అనే వ్యాధితో ఆమె పోరాడుతుంది. తాజాగా ఆమె నటించిన ‘యశోద’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై.. భారీగా కలెక్షన్స్‌ని రాబడుతుంది. కొన్నాళ్లుగా నిరాశలో ఉన్న తనకి ఈ విజయం కొంత మనోధైర్యాన్ని ఇచ్చినట్లే భావించవచ్చు. ఈ సినిమా సక్సెస్‌తో చాలా వరకు నెగిటివిటీని జయించిందనే టాక్ నడుస్తున్న సమయంలో.. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్.. విపరీతార్థాలకు దారి తీస్తూ, మళ్లీ గాసిప్ రాయుళ్లకు పని కల్పించింది.
తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ఓ పిక్‌ని షేర్ చేసింది. ఈ పిక్‌లో ఓ వ్యక్తిని ఆమె టైట్‌గా హగ్ చేసుకుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటూ ఇప్పుడొకటే చర్చలు నడుస్తున్నాయి. కానీ ఆ పిక్‌కి సమంత ఇచ్చిన వివరణతో కాస్త కూల్ అవుతున్నారు కానీ.. లేదంటే ఈ పాటికే సమంత రెండో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేసేవారు. ఇంతకీ సమంత హగ్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే.. ఆమె జిమ్ ట్రైనర్ షేక్ జునైద్. ఇంత కష్టసమయంలో కూడా ఫిట్నెస్ పరంగా పర్ఫెక్ట్‌గా ఉండడానికి ఆమెకు జునైద్ హెల్ప్ చేశాడని చెబుతూ.. అతనికి సమంత ఇలా కృతజ్ఞతలు తెలిపింది. ‘కొంతకాలంగా నాతో పాటు జర్నీ చేస్తున్న వ్యక్తులలో నీవు కూడా ఉన్నావు. ఈ జర్నీలో నా పరిస్థితిని గమనించి.. మధ్యలో వదిలిపెట్టకుండా.. మద్దతుగా నిలిచావు. ఈరోజు నాకిష్టమైన జిలేబీతో ‘యశోద’ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి.. నువ్వు కూడా ఒక కారణం’ అంటూ సమంత ఈ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. ఈ వివరణ ఇచ్చింది కాబట్టి సరిపోయింది కానీ.. కేవలం పిక్ మాత్రమే పెట్టి ఉంటే.. పరిస్థితి ఏంటో ఊహంచుకుంటేనే దారుణంగా ఉంది కదా.