Advertisementt

అవి యంగ్‌గా కనిపించేందుకే: రాధికా ఆప్టే

Mon 14th Nov 2022 04:20 PM
radhika apte,heroine,cosmetic surgeries,young heroines,cinema industry,actress radhika apte  అవి యంగ్‌గా కనిపించేందుకే: రాధికా ఆప్టే
Heroine Radhika Apte Sensationa comments on Young Heroines అవి యంగ్‌గా కనిపించేందుకే: రాధికా ఆప్టే
Advertisement
Ads by CJ

యంగ్ హీరోయిన్లపై హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లు కాస్మెటిక్ సర్జరీలకి బాగా అలవాటు పడుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నటసింహ నందమూరి బాలయ్య సరసన ఆమె రెండు సినిమాలలో నటించింది. తర్వాత టాలీవుడ్ హీరో అంటూ.. ఓ హీరోపై షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. ఆ కామెంట్స్‌తో రాధికా ఆప్టే పేరు ఆ మధ్య మారుమోగింది. ఈ మధ్యకాలంలో కూడా అప్పుడప్పుడు ఆమె ఆ కామెంట్స్‌ని రిపీట్ చేస్తూనే ఉంది. ఇలా ఒకటి కాదు.. అనేక కాంట్రవర్సీలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఎందుకు ఇదంతా ఆమె చేస్తుందనేది అప్రస్తుతం కాబట్టి.. ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు కుర్ర హీరోయిన్లపై ఆమె చేసిన కామెంట్స్‌తో మరోసారి ఆమె వార్తలలో నిలుస్తోంది. 

 

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లకు అవకాశాలు బాగున్నాయి. వారినే మేకర్స్ ఇష్టపడుతున్నారు. దీనిని గమనించిన యంగ్ హీరోయిన్స్.. వారి లోపాలను సవరించుకునేందుకు కాస్మెటిక్ సర్జరీ బాట పడుతున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లు చాలా మంది.. ఈ సర్జరీలు చేయించుకున్నవారే. దీంతో అవి సర్వసాధారణం అయిపోయాయి. సౌత్, నార్త్ అనే కాకుండా హాలీవుడ్ రేంజ్‌లో ఇప్పుడు సహజ సిద్ధమైన అందం కోసం అన్వేషణ జరుగుతుంది. న్యాచురల్ బ్యూటీస్ మేకర్స్‌కి దొరకడం లేదు. నా వరకు నేను వృద్దాప్య ఛాయలు బయటపడకుండా ఉండేందుకు ఎంతగా శ్రమిస్తున్నానో నాకే తెలుసు. ఆ శ్రమ పడకుండా కొందరు యంగ్ హీరోయిన్లు.. అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుంటున్నారు..’’ అని రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీగా మారాయి.

Heroine Radhika Apte Sensationa comments on Young Heroines:

Young Heroines Approached Cosmetic Surgeries Says Radhika Apte

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ