Advertisementt

బిగ్ బాస్ 6: మరీనా కాదు మరొకరు ఎలిమినేట్

Sun 13th Nov 2022 09:43 AM
vasanthi,bigg boss telugu 6  బిగ్ బాస్ 6: మరీనా కాదు మరొకరు ఎలిమినేట్
Bigg Boss 6: Vasanthi gets evicted బిగ్ బాస్ 6: మరీనా కాదు మరొకరు ఎలిమినేట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పదో వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అంటూ కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి.. బుల్లితెర ప్రేక్షకుల్లో ఆత్రుతని పెంచారు. నాగార్జున శనివారం ఎపిసోడ్ లో రేవంత్ నువ్ ఆటలో ఫిజికల్ అవ్వకు... అగ్రెస్సివ్ గానే ఆడు అని చెప్పిన ఆయన ఇనాయ పై మాత్రం ఫైర్ అయ్యారు. నువ్వు ఓడిపోతే F.. అనే పదాలు వాడుతున్నావ్, ఫైమని ప్రొఫెషనల్ గా అవమాన పరుస్తున్నావ్ అంటూ క్లాస్ పీకారు. దానికి ఇనాయ నన్ను నేను మార్చుకుంటా అంది. ఇక శనివారం ఎపిసోడ్ లోనే బాలాదిత్యని ఎలిమినేట్ చేసి పంపేసిన బిగ్ బాస్ యాజమాన్యం.. మరో కంటెస్టెంట్ గా మరీనా ని పంపినట్టుగా బిగ్ బాస్ లీకులు వచ్చినప్పటికీ.. ఆమె ప్లేస్ లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు.

అది బిగ్ బాస్ హౌస్ లోనే బ్యూటిఫుల్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న వాసంతి కృష్ణన్ ని ఈ రోజు ఎలిమినేట్ చెయ్యబోతున్నారు. ఆమె మొదటి రెండు మూడు వారాల్లో టాస్క్ పెరఫార్మెన్స్ విషయంలో చప్పగా ఉన్నా.. తర్వాత నాగార్జున ఇచ్చిన క్లాస్ తో టాస్క్ విషయం లో బాగా ఆడింది. కానీ గత వారం కెప్టెన్సీ టాస్క్ లో మొదటి రౌండ్ లోనే ఓడిపోయి.. సంచాలక్ గా నిలిచినా ఆమెకి పెద్దగా ఉపయోగం కాలేదు. ఇక ఓటింగ్ లోను గత రెండు మూడు వారాలుగా లీస్ట్ లోనే ఉన్న వాసంతి అసలైతే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది.. కానీ ఫైనల్ గా పదో వారం వాసంతిని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తుంది. వాసంతి ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా.. ఈరోజు నైట్ ఆ ఎపిసోడ్ ప్రసారమవుతుంది.

Bigg Boss 6: Vasanthi gets evicted:

Vasanthi Eliminated From Bigg Boss Telugu 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ