పూనమ్ బజ్వా.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఈ పేరు తెలియంది కాదు. ‘మొదటి సినిమా’, ‘బాస్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పూనమ్, కోలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాలలో నటించి.. మంచి పేరు తెచ్చుకుంది. ఈ భామ అవ్వడానికి ఉత్తరాది బ్యూటీ అయినప్పటికీ.. సౌత్‌లోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అందం, ఆ అందాన్ని ఆరబోసే తెగువ ఉన్నా కూడా.. ఈ భామకు ఎందుకో.. అంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ‘తిక్క’ సినిమా దర్శకుడితో ప్రేమ, పెళ్లి అంటూ కూడా పూనమ్‌పై అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ మధ్య ఆ దర్శకుడికి బై బై చెప్పేసినట్లుంది.. మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు తెగ ట్రై చేస్తోంది. అందుకోసమే.. ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలని పోస్ట్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ పూనమ్.. ఆ ప్రదర్శన అందుకోసం కాదని చెబుతోంది.
కోలీవుడ్‌లో రెండు మూడు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న పూనమ్ బజ్వా.. తాజాగా ఓ చిత్ర ఆడియో వేడుకకు హాజరైంది. అక్కడ ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. కోలీవుడ్‌లో గ్లామర్ పాత్రలు చేసే ఛాన్స్ రాలేదు. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారు ఆ ఫొటోలతో ఎంజాయ్ చేస్తున్నారు. వారు అలా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే.. నేనలా పోస్ట్ చేస్తున్నాను. గ్లామర్ పాత్రలు చేయనని నేనెప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ ప్రదర్శనకు సిద్ధమే. అయితే గ్లామర్‌కు, స్కిన్ షోకు చాలా తేడా ఉంది. ఇప్పటి వరకు నేను హద్దులు దాటి స్కిన్ షో చేయలేదని పూనమ్ చెప్పుకొచ్చింది.