Advertisementt

నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో హీరో రొమాన్స్!

Mon 14th Nov 2022 11:59 AM
natural star nani,adivi sesh,hit 2 promotion,tweet,  నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో హీరో రొమాన్స్!
Natural Star Nani Latest Tweet Goes Viral నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో హీరో రొమాన్స్!
Advertisement
Ads by CJ

న్యాచురల్ స్టార్ నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ.. హీరో దొరికేశాడు. ఈ విషయం స్వయంగా నానినే రివీల్ చేయడం విశేషం. ఇంతకీ ఆ హీరోహీరోయిన్లు ఎవరని అనుకుంటున్నారా? యంగ్ హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ పేర్లకి, నానికి సంబంధం ఏమిటో ఇప్పటికే అర్థమై ఉండాలి. వాళ్లిద్దరితో నాని సినిమా తీశాడు. ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘హిట్2’ చిత్రం అతి త్వరలో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా నిర్వహించే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే ఛాన్స్ అనుకుని హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి రొమాన్స్‌లో మునిగిపోయారు. అయ్యబాబోయ్.. నా ఆఫీస్‌ని ఆగం చేయకండ్రా బాబూ అంటూ నాని ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేయడంతో.. వారిద్దరి రొమాన్స్ వ్యవహారం బయటికి వచ్చింది. ఏంటీ ఇదంతా సీరియస్ అని అనుకుంటున్నారా? కానే కాదు. 

 

‘హిట్2’ సినిమాకు సంబంధించి తాజాగా ఓ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అంతకుముందు విడుదలైన టీజర్‌కు యూట్యూబ్ కొన్ని కండీషన్స్ పెట్టడంతో.. ఈ సాంగ్‌తో ఎంజాయ్ చేయాలని అడివి శేష్ ఓ వీడియోను విడుదల చేశాడు. సిధ్ శ్రీరామ్ వాయిస్‌లో వచ్చిన ఈ పాట వినగానే శ్రోతల్ని అలరించేలా ఉంది. ఇప్పుడదే సాంగ్‌కి హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి.. నాని ఆఫీస్‌లో డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్‌లో వారి కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. అందుకే నాని ‘నా ఆఫీస్‌ని ఇలా కూడా వాడొచ్చా’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Natural Star Nani Latest Tweet Goes Viral:

Hit 2 Promotion.. Nani Punch on Adivi Sesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ