నటి స్నేహ ఈ మధ్యన భర్త తో కలిసి ఉండడం లేదని, భర్త ప్రసన్నతో వచ్చిన కలతల కారణంగా స్నేహ చాలా కోపం ఉంది అని, తన ఇద్దరి పిల్లలతో భర్త ప్రసన్న నుండి దూరంగా ఉంది అంటూ కోలీవుడ్ మీడియా నుండి టాలీవుడ్ మీడియా వరకు రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా భార్య భర్తల మధ్యన మనస్పర్థలు ఎక్కువైపోయాయి. దీని కారణంగానే స్నేహ ఒంటరికిగా ఉండడమే కాకుండా ఆమె విడాకులు తీసుకోవడానికి కూడా రెడీ అవుతుంది అంటున్నారు. ఈ వార్తలపై అటు ప్రసన్న, ఇటు స్నేహ నుండి ఎలాంటి స్పందన లేదు.
కానీ ఈ రోజుస్నేహ తన ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ద్వారా తమ మధ్యన ఎలాంటి విభేదాలు లేవు, తామిద్దరం కలిసే ఉన్నామని, అది కూడా ఎంతో ప్రేమతో ట్విన్నింగ్ అంటూ ఓ పిక్ పోస్ట్ చేసింది. అందులో ప్రసన్నతో స్నేహ ఎంతో క్లోజ్ గా ఉన్న పిక్ అది. దానితో వాళ్ళ విడాకుల రూమర్స్ కి స్నేహ పిక్చర్ తో పర్ఫెక్ట్ గా చెక్ పెట్టింది.