బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎలిమినేషన్స్ విషయంలో ఎవరికీ ఊహల్లో లేని కంటెస్టెంట్స్ ని అవుట్ చేస్తూ బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకి బిగ్ షాక్ ఇస్తున్నారు. సూర్య, గీతూ రాయల్, చంటి, నేహా లాంటి వారి ఎలిమినేషన్ చూసిన వారికి ఇకపై ఎలిమినేట్ అవ్వబోయే వారి విషయంలో ఓ అంచనాకి రాలేకపోతున్నారు. అంటే బయట ఓటింగ్ లో ఒకరు లీస్ట్ లో ఉంటే.. మరొకరిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తున్నారు. దానితో ఈ వారం తొమ్మిదిమందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో ఉత్కంఠ నడుస్తున్న టైములో.. షాకింగ్ ట్విస్ట్ బయటికి వచ్చింది.
బిగ్ బాస్ పదో వారం ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారని, బాలాదిత్య, మరీనాలు డబుల్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ ని వదలబోతుననట్టుగా తెలుస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ లో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లుగా లీకులు బయటికి వచ్చాయి. హౌస్ లో మంచి వారిగా పేరు తెచ్చుకున్న బాలాదిత్య, మరీనాలు ఎవరితో గొడవపడకుండా సర్దుకుపోవడంతో.. వారిని ఇలా కూల్ గా బయటికి పంపెయ్యనున్నారట. బాలాదిత్య మొదటినుండి మంచిగా ప్రొజెక్ట్ అయ్యాడు. టాస్క్ విషయంలోనూ కూల్ గానే ఉన్నాడు, కాకపోతే సిగరెట్స్ విషయంలో బాలాదిత్యకి కాస్త ఎఫెక్ట్ పడింది. ఇక మరీనాకి మాత్రం మంచితనం అనే వీక్ నెస్ ఆమెని బయటికి పంపెయ్యడానికి కారణమయ్యింది అంటున్నారు.