Advertisementt

జబర్దస్త్ లోకి అలా కొత్తగా సౌమ్య వచ్చింది: రష్మీ

Sat 12th Nov 2022 12:53 PM
rashmi gautam,jabardast,sowmya rao  జబర్దస్త్ లోకి అలా కొత్తగా సౌమ్య వచ్చింది: రష్మీ
That's why there is a new Sowmya in Jabardasth: Rashmi జబర్దస్త్ లోకి అలా కొత్తగా సౌమ్య వచ్చింది: రష్మీ
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో ఇప్పుడు అనసూయ ప్లేస్ లో రష్మీ కాకుండా కొత్తగా తమిళ నటి సౌమ్య వచ్చి చేరింది. ఈ గురువారమే సౌమ్య జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. సౌమ్య అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. మరి కమెడియన్స్ కొత్త యాంకర్ ని వదిలేస్తారా.. తమ స్టయిల్ లో వారు సౌమ్య ని ర్యాగింగ్ చేసారు. హైపర్ అది అయితే సౌమ్య అయితేనేమి.. మా చేతిలో సేమ్యా అవ్వాల్సిందే అంటూ సెటైర్స్ కూడా వేసాడు. మిగిలిన కమెడియన్స్ కూడా సౌమ్య ని ఆడేసుకున్నారు. అంతేకాదు జేడ్జ్ గా వస్తున్న కృష్ణ భగవాన్ కూడా సౌమ్య మీద సెటర్స్ వేస్తూ కామెడీ పుట్టించారు. సౌమ్య వాళ్ళ నుండి కాపాడుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేసింది.

అయితే సౌమ్య జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి మల్లెమాలే కారణం అంటుంది రష్మీ. అనసూయ వెళ్ళగానే కొద్ది రోజులు జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా చెయ్యమన్నారు చేశాను. గతంలోనూ అనసూయ ఎప్పుడైనా మిస్ అయితే నన్ను అడిగేవారు. ఇప్పుడు కొత్త యాంకర్ వచ్చింది ఆ విషయం నాకు చెప్పారు. అందుకే గురువారం జబర్దస్త్ కి రావడం లేదు. కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి నేనే యాంకర్ ని అంటూ సౌమ్య జబర్దస్త్ కి ఎలా ఎంట్రీ ఇచ్చిందో చెప్పుకొచ్చింది.

That's why there is a new Sowmya in Jabardasth: Rashmi:

Rashmi Gautam About Jabardasth New Anchor Sowmya Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ