పెళ్లి సందD సినిమాలో చాలా క్యూట్ గా స్వీట్ గా గ్లామర్ గా కనిపించిన శ్రీలీల కి ఆ సినిమా ప్లాప్ అయినా ఆమెకి అవకాశాలు మాత్రం తలుపుతడుతూనే ఉన్నాయి. పెళ్లి సందD తర్వాత శ్రీలీల రవితేజ ఢమాకా అలాగే నితిన్ తో మరో మూవీ, రామ్ తో పాన్ ఇండియా మూవీ అంటూ దూసుకుపోతుంది. అందం, అభినయంతో సందడి చేస్తుంది. అయితే పెళ్లి సందDకి ఆమె 5 లక్షల రూపాయల పారితోషకం అందుకున్న శ్రీలీల రవితేజ సినిమాకి 50 లక్షలు డిమాండ్ చేసి తీసుకుందట.
రామ్ పోతినేని-బోయపాటి సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో దానికి ఏకంగా 80 లక్షలు డిమాండ్ చేసి ఒప్పించిందట. మరోపక్క బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య కూతురుగా నటించేందుకు కూడా ఆమె డిమాండ్ భారీగా ఉందట. ఇక ఇప్పుడు ఆమె దగ్గరకి వస్తున్న దర్శకనిర్మాతలకు కోటి డిమాండ్ చేస్తుందట. చేతిలో సినిమాలు ఉన్నాయి. వరసగా అవకాశాలు వస్తున్నాయి.. దానితో అమ్మడి రేంజ్ పెరిగిపోయి.. కోటికి ఎసరు పెట్టిందట. పెళ్లి సందడి హిట్ కాదు, ఇప్పటివరకు మరో సినిమా విడుదల కాలేదు. ఒక్క హిట్ లేదు. కానీ అమ్మడి కొచ్చే అవకాశాలు రేంజ్ ఆమెని కోటికి దగ్గర చేసేసింది.