Advertisementt

సానియా మీర్జా-షోయెబ్ విడాకుల్లో ట్విస్ట్

Sat 12th Nov 2022 11:10 AM
shoaib malik,ayesha,sania mirza  సానియా మీర్జా-షోయెబ్ విడాకుల్లో ట్విస్ట్
Sania Mirza and Shoaib Malik to announce divorce సానియా మీర్జా-షోయెబ్ విడాకుల్లో ట్విస్ట్
Advertisement
Ads by CJ

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకుంటుంది అనే న్యూస్ ప్రస్తుతం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న వార్త. పాకిస్తానీ క్రికెటర్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న సానియా మీర్జాకి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఎక్కువగా సానియా మీర్జా తల్లితండ్రులతోనే కలిసి హైదరాబాద్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు భర్త షోయెబ్ తో కలిసి దుబాయ్ లో ఉండే సానియా మీర్జా వైవాహిక జీవితం అంతా సరిగా లేదని, భార్య భర్తల మధ్యలో తరుచు గొడవలు జరగడంతో వీరు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారని అంటున్నారు.

అయితే వీరి విడాకుల విషయంలో ఓ ట్విస్ట్ హైలెట్ అయ్యింది. అది షోయబ్ మాలిక్.. తన భార్య సానియా మీర్జా తో కాకుండా ఓ పాకిస్తానీ హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటున్నాడని, ఆమె పాకిస్తాన్ కి చెందిన అయేషా అని, ఆమెతో తో ఎఫ్ఫైర్ నడుపుతున్న విషయం తెలిసిన సానియా మీర్జా షోయబ్ తో గొడవపెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. సానియా-షోయెబ్ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. సానియా తనతో ఎక్కువగా కలిసి ఉండడం లేని కారణంతోనే షోయెబ్ అయేషా తో రిలేషన్ మెయింటింగ్ చేస్తున్నట్లుగా వాదించడంతోనే సానియా ఇలా విడాకులకు అప్లై చేసింది అనే న్యూస్ హైలెట్ అయ్యింది.

Sania Mirza and Shoaib Malik to announce divorce:

Shoaib Malik photos with Pak actress Ayesha go viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ