Advertisementt

భారీ టార్గెట్ ఫిక్స్ చేస్తున్న వాల్తేర్ వీరయ్య

Fri 11th Nov 2022 10:57 PM
waltair veerayya,waltair veerayya pre release business  భారీ టార్గెట్ ఫిక్స్ చేస్తున్న వాల్తేర్ వీరయ్య
Waltair Veerayya Pre release business భారీ టార్గెట్ ఫిక్స్ చేస్తున్న వాల్తేర్ వీరయ్య
Advertisement
Ads by CJ

వాల్తేర్ వీరయ్య లుక్ లో మెగాస్టార్ చిరంజీవిని చూసిన మెగా ఫాన్స్ మాస్ గా ఊగిపోతున్నారు. ఆచార్య లో చిరు లుక్ విషయంలో డిస్పాయింట్ అయిన ఫాన్స్.. గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ ని ఆరాధించారు. ఇక ఇప్పుడు వాల్తేర్ వీరయ్య గా మెగా మాస్ లుక్ కి మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అందులోను ఈ సినిమాలో రవితేజ కూడా నటించడంతో సినిమాపై సహజంగానే అంచనాలున్నాయి. గాడ్ ఫాదర్ హిట్ వాల్తేర్ వీరయ్యకి కలిసొస్తుంది. దానితో వాల్తేర్ వీరయ్య థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలవడమే కాదు, ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా తెలుస్తుంది.

బాబీ డైరెక్షన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య థియేట్రికల్ రైట్ 95 కోట్ల మేర అమ్ముడు పోయినట్లుగా తెలుస్తుంది. అంటే వాల్తేర్ వీరయ్య 96 కోట్ల భారీ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది. వాల్తేర్ వీరయ్య ఏరియా ల వారీగా.. ఎంతకు అమ్ముడుపోయింది అంటే.. నైజాంలో 22 కోట్లు, సీడెడ్ లో 15 కోట్లు, ఆంధ్రలోని అన్ని ఏరియా లకి కలిపి 42 కోట్ల బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే  ఓవ‌ర్ సీస్ రైట్స్ రేటు16 కోట్లు అయ్యాయి. మొత్తంగా క‌లిపి చూస్తే 95 కోట్ల మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింద‌ని టాక్‌. అంటే వాల్తేర్ వీరయ్య బాక్సాఫీస్ దగ్గర 96 కోట్లు కొల్లగొడితేనే సేఫ్ అవుతుంది.

Waltair Veerayya Pre release business :

Waltair Veerayya Pre release business details out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ