పాన్ ఇండియా స్టార్ గా ఆ హోదాని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు ఇండియా వైడ్ గా ఎల్లలు దాటింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అందరి మనసులని దోచేశాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ద రూల్ తో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించారు. అయితే అల్లు అర్జున్ చాలాసార్లు చాలా సందర్భాల్లో అభిమానులకి సహాయం చేసాడు. కానీ ఇప్పుడో కేరళ విద్యార్థికి చేసిన సహాయం మాత్రం ఎవరికీ చెప్పుకోకుండా సైలెంట్ గా చేసేసాడు. అల్లు అర్జున్ కేరళలోగా నిరుపేద అమ్మాయికి సహాయం చేసిన విధానం ఎంతగానో అందరిని ఆకట్టుకుంది. అయితే అల్లు అర్జున్ ఆ కేరళ విద్యార్దికి సహాయం చేసిన విషయం చాలా లేట్ గా మీడియాకి తెలిసింది.
అసలు విషయం ఏమిటి అంటే కేరళకి చెందిన ఓ అమ్మాయి గత ఏడాది కరోనా కారణంగా తండ్రిని కోల్పోయింది. ఎన్నో ఇబ్బందులతో 92 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైన ఆ అమ్మాయి గురించి తెలుసుకున్న అలిప్పి కలెక్టర్ కృష్ణ తేజ ఆ అమ్మాయికి ఎలాగైనా సహాయం చెయ్యాలని స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకువెళ్లాడు. దానితో అల్లు అర్జున్ వెంటనే ఆ అమ్మాయికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కాలేజీ ట్యూషన్ ఫీజుతోపాటు ఆమె నాలుగేళ్ల పాటు హాస్టల్లో ఉండేందుకు ఖర్చులు కూడా భరిస్తాను అని మాట ఇచ్చినట్లుగా కలెక్టర్ తెలియజేశాడు.
దానితో అల్లు అర్జున్ ఆ అమ్మాయికి సహాయం చేసిన విషయం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యిపోయింది. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా కూడా చెప్పుకోలేదు. నిజంగా అల్లు అర్జున్ ది చాల గొప్ప మనసు అంటూ అందరూ కొనియాడుతున్నారు.