Advertisementt

ఎన్టీఆర్ న్యూ లుక్: ఎగ్జైట్ అవుతున్న ఫాన్స్

Fri 11th Nov 2022 06:58 PM
ntr,ntr new look,ntr fans  ఎన్టీఆర్ న్యూ లుక్: ఎగ్జైట్ అవుతున్న ఫాన్స్
NTR New Look ఎన్టీఆర్ న్యూ లుక్: ఎగ్జైట్ అవుతున్న ఫాన్స్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈమధ్యన జపాన్ ట్రిప్ లో ఆయన ఫాన్స్ కి అడుగడుగునా ట్రీట్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ లుక్ పై ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఆయన ట్రిపుల్ ఆర్ కోసం పెరిగిన బరువు తగ్గించడానికి చాలా కష్టపడ్డాడు. కొరటాలతో చెయ్యబోయే మూవీ ఆలస్యమవడంతో ఎన్టీఆర్ ఇప్పుడు భారీగా వెయిట్ లాస్ అయ్యి కొత్త లుక్ లోకి వచ్చేసారు. జపాన్ ట్రిప్ లో యంగ్ టైగర్ లుక్ కి ఫాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఇంప్రెస్స్ అయ్యారు.

అయితే ఎన్టీఆర్ కొరటాల శివ తో చెయ్యబోయే మూవీలో ఎన్టీఆర్ ఏ లుక్ లో కనబడతారో అనే క్యూరియాసిటిలో ఉన్నారు అందరూ. ఇప్పటికే NTR30 ప్రీ ప్రొడక్షన్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. మేకర్స్ ఇచ్చే చిన్న చిన్న అప్ డేట్స్ కే ఎన్టీఆర్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. ఎన్టీఆర్ ఎన్టీఆర్30 కోసం మేకోవర్ అవుతున్న పిక్ తో పాటుగా A new day, A new vibe అంటూ ఆయన ఇన్స్టా లో షేర్ చేసారు. ఎన్టీఆర్ స్పెట్స్ పెట్టుకుని క్రాఫ్ పక్కకి దువ్విన పిక్ ని చూడగానే ఎన్టీఆర్ కొత్త లుక్ అంటూ లైక్స్, షేర్స్ కొడుతూ ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.

అయితే ఎన్టీఆర్ ఈ లుక్ లోకి మరింది.. ఆయనొక ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారి.. ఆ బ్రాండ్ యాడ్ షూట్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ ఆ యాడ్ కి సంబంధించి అని తెలుస్తుంది.

NTR New Look:

NTR New Look, Impressing fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ