సమంత నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని ఫ్యామిలీ కి చాలా క్లోజ్ అయ్యింది. అమల, నాగార్జున, అఖిల్ అందరూ సమంత ప్రేమించారు. కానీ నాగ చైతన్య తో విడాకుల తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుండి ఒక్క చెడు మాట సమంత మీద పడలేదు, అనలేదు. అక్కినేని ఫ్యామిలీ సామ్-చై విడాకుల విషయంలో చాలా హుందాగా వ్యవహరించారు. కానీ సమంత ఆ స్ట్రెస్ తట్టుకోలేక చాలా విషయాలని సోషల్ మీడియాలో బహిర్గత పరిచింది. ట్రోల్స్ కి గురయ్యింది. అయితే ఈమధ్యన సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతుంది. ఆమె ఈ మాయోసైటిస్ వ్యాధితో చనిపోకపోవచ్చు కానీ.. ఆ వ్యాధి తీవ్రతతో సమంత పోరాటం చేస్తుంది. రీసెంట్ గా యశోద ఇంటర్వ్యూలో సమంత తన బాధని తెలియజేసింది. అది విన్న అభిమానులే కాదు.. అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే సమంత నటించిన యశోద నేడు శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాని వీక్షించిన మాజీ సెన్సార్ బోర్డు సభ్యురాలు, సమంత అభిమాని ఛానల్స్ తో మాట్లాడుతూ.. సమంత అంటే నాకు పర్సనల్ గా ఇష్టం. నేను ఆమె అభిమానిని. ఆమె అందమైనది, చదువుకున్నది, అలాగే ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చింది. ఆమె నటించిన సినిమా విషయం అలా ఉంచితే.. సమంత మాయోసైటిస్ తో పోరాడుతుంది. ఇలాంటి సమయంలో ఆమె అభిమానిగా నేను అక్కినేని ఫ్యామికులిని, ఆమె మాజీ భర్త చైతన్య ని కోరుకుంటున్నది ఒక్కటే, ఆమె కొద్ది రోజులు అక్కినేని ఫ్యామిలీకి కోడలిగా, చైతూకి భార్యగా ఉంది. మాజీ భార్య అయినప్పటికీ.. నాగ చైతన్య, అక్కినేని ఫ్యామిలీ సమంత దగ్గరకి రావాలి, ఆమెకి వాళ్ళ నుండి మోరల్ సపోర్ట్ కావాలి, సమంత మాజీ భార్య అయినప్పటికీ, ఓ సహా నటిగా ఆమెకి ధైర్యం చెప్పండి చైతన్య గారు. మేము ఆమె దగ్గరికి పోయి ఆమెకి సపోర్ట్ ఇవ్వలేము.
మీకు నేను ఓ అభిమానిగా క్షమాపణ అడుగుతున్నాను అంటూ ఆమె ఛానల్స్ తో మట్లాడుతూ డిమాండ్ చెయ్యడం అందరిని ఆకర్షించింది.