మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజ కలయికలో రాబోతున్న వాల్తేర్ వీరయ్య షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. కారణం సినిమాని సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడమే. దర్శకుడు బాబీ వాల్తేర్ వీరయ్య షూటింగ్ గబగబా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికే మాస్ మసాలా ఐటెం సాంగ్ ని రవితేజ-చిరు అలాగే బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కలయికలో పూర్తి చేసిన బాబీ.. ఓ చిన్నపాటి షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. అయితే సంక్రాంతి కి ఎంత పోటీ ఉన్నప్పటికీ.. బాబీ-చిరు లు ముందుగానే వాల్తేర్ వీరయ్యని సంక్రాంతి విడుదల అని ప్రకటించారు. తర్వాతే బాలకృష్ణ తన సినిమా వీర సింహ రెడ్డిని సంక్రాంతికి విడుదల అంటూ ప్రకటించారు.
అయితే బాలయ్య-చిరుల వీర సింహ రెడ్డి-వాల్తేర్ వీరయ్య రెండు సినిమాలని నిర్మించేది ఒకే నిర్మాణ సంస్థ కావడంతో.. ఈ రెండిటిలో ఏదో ఒకటి వాయిదా పడొచ్చని అన్నప్పటికీ.. అటు చిరు-బాలయ్యా ఇద్దరూ సంక్రాంతి నుండి తప్పుకునే ఆలోచనలో లేకపోవడంతో.. రెండు సినిమాలకి వేర్వేరు డేట్స్ కి కేటాయించే ప్రయత్నంలో మైత్రి వారు ఉన్నారట. దానిలో భాగంగా చిరు వాల్తేర్ వీరయ్యని జనవరి 13 న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, రెండు మూడు రోజుల్లో వాల్తేర్ వీరయ్య రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావొచ్చు అంటున్నారు.